Vaishnav Tej: యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ కు ‘కొండపొలం’ బాగా నిరాశ పరిచింది. ఉప్పెనతో వచ్చిన స్టార్ డమ్ ‘కొండపొలం’ పట్టుకెళ్ళి పోయింది. అందుకే ఉప్పెన సినిమాకు ముందు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ పోయిన వైష్ణవ్, ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. ఉప్పెన తరువాత రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. ఆ రెండు సినిమాల్లో ఒకటి ‘కొండపొలం’ కాగా, మరొకటి సురేందర్ రెడ్డి సినిమా.

దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా వైష్ణవ్ కోసం అదిరిపోయే కథను పట్టుకున్నాడు. సీనియర్ దర్శకుడు దశరధ్ ఈ సినిమాకు కథను అందిస్తున్నాడు. కథ చాలా బాగా కుదరడంతో మొత్తానికి ఈ సినిమాకి అందరి వైపు నుంచి అంగీకారం కుదిరింది. ఇక ఈ సినిమాకు బోగవిల్లి ప్రసాద్ నిర్మాత. అయితే, మొదట ఈ సినిమాకు ఏభై కోట్లు బడ్జెట్ అనుకున్నారు.
కానీ, ‘కొండపొలం’ కలెక్షన్స్ చూశాక, మేకర్స్ మళ్ళీ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. అసలు వైష్ణవ్ తేజ్ కు ఏభై కోట్ల మార్కెట్ ఉందా ? నిజానికి ఉప్పెన సినిమాకు 70 కోట్లు వచ్చాయి. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’ సినిమాకు మాత్రం 8 కోట్లు మాత్రమే వచ్చాయి. అందుకే బడ్జెట్ ను తగ్గించాలి అని బోగవిల్లి ప్రసాద్ సురేందర్ రెడ్డిని కోరాడు.
అయితే, కథ ప్రకారం బడ్జెట్ తగ్గిస్తే.. సినిమా చేయడం కష్టం అని, కాబట్టి బడ్జెట్ తగ్గించలేం అంటూ సురేందర్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా ఇప్పుడు డౌట్ లో పడింది. ఎలాగూ ఈ సినిమా స్టార్ట్ కావడానికి టైం పడుతుంది. ముందు సురేందర్ రెడ్డి అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమాను పూర్తి చేయాలి.
Also Read: Pawan Kalyan: ప్చ్.. పవన్ లో రైటర్ నిద్ర లేచాడు !
ఆ తర్వాత వైష్ణవ్ సినిమా ఉంటుంది. మరి ఆ లోపు ఏమైనా జరగొచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా లేనట్టే. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ కథలు వింటున్నాడు. కొత్త మరియు చిన్న దర్శకులతో సినిమా చేయడానికి వైష్ణవ్ తేజ్ ఆసక్తిగా లేడు. స్టార్ డైరెక్టర్ల కోసం వైష్ణవ్ వెయిట్ చేస్తున్నాడు.
Also Read: Niharika: మెగా బ్రదర్ నాగబాబు పుట్టిన రోజు కానుకగా… అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన నిహరిక