Chandrababu: పాత ఒక రోత.. కొత్త ఒక వింత.. ఇప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు రాజకీయాలన్నీ పాతబడిపోయావన్న టాక్ వినిపిస్తోంది. సీఎం జగన్ నవతరం పాలిటిక్స్ తో వ్యూహకర్తలతో ముందుకు సాగుతుండగా.. చంద్రబాబు అవే పాత పాలిటిక్స్ తో వెనుకబడి పోతున్నారన్న చర్చ సాగుతోంది. ఏపీలో ఇటీవల ‘బూతు’ రాజకీయం వేడెక్కింది.. డ్రగ్స్ వ్యవహారంలో ప్రభుత్వ హస్తం ఉందంటూ కొందరు టీడీపీ నాయకులు సీఎం జగన్ అని కూడా చూడకుండా ధూషణలు చేయడంతో అధికార పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ‘బూతు’ నాయకులను అరెస్టు చేయాలని ఆందోళనలు చేయడంతో ఎట్టకేలకు పోలీసులు వారిని జైళ్లో పెట్టారు. అయితే ఈ ఉద్రిక్తలకు కారణమైన చంద్రబాబు మాత్రం ఎలాంటి ఆందోళనలు లేకుండా కనిపిస్తోంది. ఎందుకంటే జరిగేదంతా ఆ పెద్దన్నకు తెలుసు కావచ్చని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. అందుకే సీఎంపై విమర్శలు చేసిన టీడీపీ నేత పట్టాభి అరెస్టు జరిగినప్పుడు చంద్రబాబు ఫేస్ ఫీలింగ్లో కొత్త మార్పులేవీ కనిపించలేదు. అయితే చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నవన్నీ ఒకప్పటి రాజకీయాలని కొందరు విమర్శిస్తున్నారు. పాత సీసాలో కొత్త సారా మాదిరిగా వెనుకటి రాజకీయాలు చేస్తే ఎదుటివారు గుర్తుపట్టరా బాబూ.. అని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇటీవల డ్రగ్స్ వ్యవహరంపై ఎల్లో బ్యాచ్ ఉవ్వెత్తున ఎగిసిపడింది. తమ ప్రభుత్వంలో ఎలాంటి డ్రగ్స్ మాఫియా లేదన్నట్లుగా.. డ్రగ్స్ వ్యవహారమంతా ప్రభుత్వమే నిర్వహిస్తోందన్నట్లుగా….ఆందోళనలు చేసింది. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నాయకులు హద్దులు దాటారు కూడా. సీఎం జగన్ అని కూడా చూడకుండా తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. అయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఎంత విలువ ఉంటుందో బాబుకు తెలియంది కాదు. ఎందుకంటే 40 ఏళ్ల జీవితంలో 13 ఏళ్లు సీఎంగా పనిచేశారు కదా.. అయినా సీఎం స్థాయి వ్యక్తిని అంతలా మాటలంటే చంద్రబాబు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. పైగా తమపై దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు.
ఇక ఇప్పుడు చంద్రబాబు పక్కనున్న కొందరు ఒకప్పుడు డ్రగ్స్ దందా నడపలేదా..? అంటే బాబు ఒప్పుకుంటారా..? వారిని పక్కనేసుకొని డ్రగ్స్ దందా నిర్మూలించాలని ఆందోళన చేయడమేంటని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇక గత కొద్ది రోజులుగా టీవీల్లో నిత్యం కనిపిస్తున్న కొమ్మురెడ్డి పట్టాభి గతంలో ఏం చేశాడో చంద్రబాబుకు తెలియదా..? చిన్నపాటి లాడ్జి పేరుతో ఎలాంటి దందాలు చేశారో ఆయనకు తెలియదా..? టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం కనిపించని పట్టాభి ఆ పార్టీ అధికారం కోల్పోగానే బయటికి వచ్చారు. అంటే అతని అవసరం ఇప్పుడు ఏర్పడింది కావచ్చు..అని చర్చించుకుంటున్నారు.
నాటి ఎన్టీఆర్ హయాంలో మల్లెల బాబ్జి తో ఎన్టీఆర్ పై దాడి చేయించి ఆ తరవాత రాజకీయ లబ్ధి పొందిన చంద్రబాబు ఇప్పుడు అలాంటి రాజకీయాలే చేస్తున్నారని అంటున్నారు. తన అవసరం కోసం రాజకీయాలను తనకు అనుకూలంగా మలుచుకుంటారని అంటున్నారు. అంతెందుకు ఇసుక మాఫియా విషయంలో.. అక్రమ మద్యం విషయంలో టీడీపీ నేతల హస్తం ఉందని తెలియగానే వాటి ఆందోళన వైపు వెళ్లడం బాబు మానేశారు. ఎందుకంటే సొంత పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయరు కదా.. అని అంటున్నారు. మరోవైపు విజయవాడలోని కాల్ మనీ -సెక్స్ రాకెట్లో దొరికిన వాళ్లంతా ఎల్లో బ్యాచ్ అన్న విషయం అప్పట్లోనే బయటపడింది. అందుకే ఆ కేసు కంటితుడుపు చర్యగా వదిలేశారు.
గంజాయి అక్రమ రవాణాపై చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాల కోటిరెడ్డి అనే వ్యక్తి సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాలకోటిరెడ్డి పై గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో గంజాయీ కేసులు, రౌడీ షీట్ లు ఉన్న విషయం ప్రజలకు తెలియదా..? అని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. పార్టీ ఓడిపోగానే ఇలాంటి వ్యక్తలును ముందుంచి వారితో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయిస్తున్న చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. అయితే బాబు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందని ప్రజలే చెబుతారు కదా.. ఈ పాతతరం రాజకీయాలతో చంద్రబాబే డిఫెన్స్ లో పడిపోతున్నారని.. ఆయన ఎత్తులకు ఆయనే చిత్తు అవుతున్నారని అంటున్నారు.