Homeఎంటర్టైన్మెంట్Unstoppable Record: బాలయ్య...

Unstoppable Record: బాలయ్య టాక్ షోకు ఎదురులేదు.. సరికొత్త రికార్డు బ్రేక్..!

Unstoppable Record Break: నందమూరి బాలకృష్ణ వెండితెరపైనే కాకుండా ఓటీటీల్లోనూ సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు. ఇటీవలే ‘అఖండ’తో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న బాలయ్య బుల్లితెరపై కూడా ఓ రికార్డును బ్రేక్ చేసి అక్కడ కూడా తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. అల్లు అరవింద్ ‘ఆహా’ కోసం బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షో చేస్తున్నాడు. దీనికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో పలు కొత్త రికార్డులు నమోదవుతున్నాయి.

Unstoppable Record:
Unstoppable Record:

‘అన్ స్టాపబుల్’ టాక్ షో ఇప్పటికే ఎనిమిది ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమానికి తొలి గెస్ట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హాజరయ్యాడు. ఆ తర్వాత ప్రముఖ హస్యనటుడు బ్రహ్మనందం, దర్శకులు అనిల్ రావుపూడి, సుకుమార్, గోపిచంద్ మలినేని, హీరోయిన్ రష్మిక మందన్న, హీరోలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజ్ రవితేజ, దగ్గుపాటి రానా, సూపర్ స్టార్ మహేష్ బాబు తదితరులు హాజరయ్యారు. తాజాగా ‘లైగర్ ’ టీం కూడా బాలయ్య షోలో పాల్గొంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా రానుంది.

Also Read: చైనాతో సరిహద్దు వివాదం ఎఫెక్ట్… ఐపీఎల్ స్పాన్సర్‌గా టాటా..

ఇదిలా ఉంటే బాలయ్య టాక్ షోను ‘ఆహా’టీం ప్రత్యేకంగా రూపొందించింది. దీంతో ఈ కార్యక్రమం ‘అన్ స్టాపబుల్’ గా దూసుకెళుతోంది. తాజాగా ఈ టాక్ షో దేశంలోనే నెంబర్ షోగా గుర్తింపు తెచ్చుకొని సరికొత్త రికార్డును నెలకొల్పుతోంది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) ఇండియా టాక్ షోలపై ఇటీవల సర్వే నిర్వహించి తాజాగా వివరాలను వెల్లడించింది.

ఐఎండీబీ సర్వే ప్రకారంగా దేశంలోనే ‘అన్ స్టాపబుల్’ టాక్ షో నెంబర్ వన్ గా నిలిచింది. ఈ షోకు 9.7 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు కపిల్ శర్మ నిర్వహిస్తున్న ‘ది కపిల్ శర్మ షో’ నిలిచింది. ఈ షోకు 7.8 పాయింట్స్ వచ్చాయి. మాజీ మిస్ ఇండియా, ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ నిర్వహిస్తున్న ‘అమెజాన్ ఫ్యాషన్ అప్’ షో 4.9 టీఆర్పీతో పదో స్థానంలో నిలువడం గమనార్హం. ఏదిఏమైనా బాలయ్య తన తొలి టాక్ షో తోనే దేశంలోనే నెంబర్ వన్ గా నిలువడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: బాలయ్య టాక్ షోకు ఎదురులేదు.. సరికొత్త రికార్డు బ్రేక్..!

Get notified whenever we post something new!

Continue reading

KCR Ganesh : కేసీఆర్ ‘వినాయకుడా’ మజాకా.. అట్లుంటది మరీ!

పోలీస్ ఎస్కార్ట్ తో ట్యాంక్ బండ్ వచ్చిన సీఎం క్యాంప్ ఆఫీస్ గణేశుడిని క్రేన్ నంబర్ 3 వద్ద క్యాంప్ ఆఫీస్ సిబ్బంది, పూజారి టీం నిమజ్జనం పూర్తి చేశారు.

KCR vs Journlists : ‘కేసీఆర్’ రాజ్యం.. వ్యతిరేకంగా రాసే జర్నలిస్టులకు ఇళ్లు ఇవ్వం

మాటలు జాగ్రత్త కేసీఆర్.. అధికారం శాశ్వతం కాదు.’ అంటూ సోషల్ మీడియాలో పలువురు జర్నలిస్టులు పోస్టులు పెడుతున్నారు.

Chiranjeevi – Star Hospitals : చిరంజీవి సేవా నిరతి.. వాళ్ల కోసం ఉచిత క్యాన్సర్ క్యాంప్

ఈ ఉచిత క్యాన్సర్ క్యాంప్ ను మొదట ఈనెల 16న విశాఖపట్నంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహిస్తున్నారు. దీనికి అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version