https://oktelugu.com/

Unstoppable Show: బాలయ్య అన్ స్టాపబుల్ షో కి నెక్స్ట్ గెస్ట్ లుగా రానున్నది ఎవరంటే…

Unstoppable Show: ఆహా ఓటిటిలో నందమూరి బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ షోపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ షో తొలి ఎపిసోడ్ కి గెస్ట్ గా మోహన్ బాబుని రంగంలోకి దించారు. రెండవ ఎపిసోడ్ కి గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని హాజరయ్యాడు. బాలయ్య తొలిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కావడంతో అన్ స్టాపబుల్ షో కి అభిమానుల నుంచి విశేష స్పందన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 19, 2021 / 09:05 PM IST
    Follow us on

    Unstoppable Show: ఆహా ఓటిటిలో నందమూరి బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ షోపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ షో తొలి ఎపిసోడ్ కి గెస్ట్ గా మోహన్ బాబుని రంగంలోకి దించారు. రెండవ ఎపిసోడ్ కి గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని హాజరయ్యాడు. బాలయ్య తొలిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కావడంతో అన్ స్టాపబుల్ షో కి అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రానున్న రోజుల్లో ఈ షోకి అతిథులుగా క్రేజీ సెలెబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. తర్వాత ఎపిసోడ్ లకు విజయ్ దేవరకొండ, ఎమ్మెల్యే రోజా, యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్, రానా రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    అయితే వీరిలో వెండితెరపై బాలయ్య లక్కీ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ ఎమ్మెల్యే రోజా  త్వరలోనే అన్ స్టాపబుల్ షోకి అతిథిగా హాజరు కాబోతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బాలకృష్ణ, రోజా కాంబినేషన్ అంటే వెంటనే అభిమానులకు బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం లాంటి క్లాసిక్ హిట్స్ గుర్తుకు వస్తాయి. బాలయ్య, రోజా వెండితెరపై సూపర్ హిట్ జోడి అని పేరుంది. ఈ రెండు చిత్రాలు మాత్రమే కాక బాలయ్యతో రోజా పెద్దన్నయ్య, మాతో పెట్టుకోకు, సుల్తాన్ లాంటి చిత్రాల్లో కూడా రొమాన్స్ చేసింది.

    అందుకే రోజా, బాలయ్య మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ రోజాకు బాలయ్య అంటే అభిమానం. కానీ పొలిటికల్ గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం రోజా బాలయ్యపై విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య సినిమా విషయాలతో పాటు.. వారి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు, రాజకీయాల గురించి కూడా ప్రస్తావిస్తారు. దీంతో రాజకీయాలపై వాడి వేడిగా వారి మధ్య చర్చ జరిగింది. ఇక అలానే నందమూరి కుటుంబన్ సభ్యులైన తారక్, బాలయ్య లను ఒకే షో లో చూడాల్ని నందమూరి అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.