Chiranjeevi – Star Hospitals : ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, కరోనా వేళ ఇతోదిక సాయం చేసి చిరంజీవి తన పెద్ద మనసు చాటుకున్నాడు. అన్నీ తానై వ్యవహరించాడు. ఇండస్ట్రీ పెద్దగా అవతరించాడు. కరోనా వేళ ఆకలితో అలమటించిన వారిని ఆదుకున్నాడు. ఆక్సిజన్ అందని వారికి సిలిండర్లు ఇచ్చి మరీ సేవ చేస్తున్నారు.
తాజాగా మరోసారి చిరంజీవి తన ఆపన్న హస్యం అందించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ & స్టార్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహణకు నిర్ణయించారు.
క్యాన్సర్ ని ముందుగా గుర్తించడం వలన , వ్యాధి నివారణ మరియు నియంత్రణ సులభం అవుతాయి. అందుకే ఈ మహమ్మారి నుంచి రక్షించడానికి చిరంజీవి పూనుకుంటున్నారు. స్టార్ హాస్పిటల్స్ తో కలిసి బడుగు బలహీన వర్గాలు, సినిమా కళాకారులు, పేదలకు సేవ చేసేందుకు గొప్ప సంకల్పం తీసుకున్నారు.
ఈ ఉచిత క్యాన్సర్ క్యాంప్ ను మొదట ఈనెల 16న విశాఖపట్నంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహిస్తున్నారు. దీనికి అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఈ క్యాన్సర్ క్యాంప్ లో నిర్వహించు పరీక్షలు ఇవీ
రొమ్ము క్యాన్సర్ !
గర్భాశయ క్యాన్సర్ !
కొలొరెక్టర్ క్యాన్సర్ !
గ్యాస్ట్రిక్ /అన్నవాహిక క్యాన్సర్ !
ఊపిరితిత్తుల క్యాన్సర్ !
ఓరల్ క్యావిటీ క్యాన్సర్ !