https://oktelugu.com/

Nandhamuri Bala Krishna:  బాలయ్య మంచితనాన్ని అన్ స్టాపబుల్ షో లో బయటపెట్టిన నాని…

Nandhamuri Bala Krishna:  నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారని చెప్పాలి. ఓ వైపు సినిమాలు మరో వైపు ఓటిటీ లో టాక్ షో చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కాగా ” అన్‌స్టాప‌బుల్‌ “అంటూ తొలి ఎపిసోడ్ లో మంచు కుటుంబం తో సందడి చేశారు. అయితే మొదటి ఎపిసోడ్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది ఈ టాక్ షో మళ్ళీ ఎప్పుడు స్క్రీనింగ్ అనుకునే లోపల సెకండ్ ఎపిసోడ్ లో నాచురల్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 13, 2021 / 06:45 PM IST
    Follow us on

    Nandhamuri Bala Krishna:  నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారని చెప్పాలి. ఓ వైపు సినిమాలు మరో వైపు ఓటిటీ లో టాక్ షో చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కాగా ” అన్‌స్టాప‌బుల్‌ “అంటూ తొలి ఎపిసోడ్ లో మంచు కుటుంబం తో సందడి చేశారు. అయితే మొదటి ఎపిసోడ్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది ఈ టాక్ షో మళ్ళీ ఎప్పుడు స్క్రీనింగ్ అనుకునే లోపల సెకండ్ ఎపిసోడ్ లో నాచురల్ స్టార్ తో సరదాగా తనదైన శైలిలో దూసుకుపోయారు. బాలయ్య మోహన్ బాబు కుటుంబంతో కొంచెం సన్నిహితంగానే ఉంటాడు అనే విషయం తెలిసిందే.  ఆ చొరవతో తొలి ఎపిసోడ్ లో కాస్త ఎక్కువ అడిగారు ఏమో అని… నానితో కూడా సరదాగా ముచ్చటించి, క్రికెట్ ఆడి నానితో అన్‌స్టాప‌బుల్‌ అనిపించారు.

    అయితే ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ కాపాడిన ఓ ప్రాణాన్ని… నాని షో లో అందరి ముందుకు తీసుకొచ్చారు.  ఆ చిన్నారిని  చూసిన వెంటనే బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. ఆమెను దగ్గరకు తీసుకుని ఆత్మీయంగా ముద్దాడారు. బాలకృష్ణ కాపాడిన ఆ ప్రాణం పేరు వినీలాంబిక. ఆ చిన్నారిది పదవర్లపూడి. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతుంది. కాగా ఆ పాప జూన్ 2, 2011లో జన్మించగా… పుట్టిన రెండు నెలల తర్వాత ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అన్నారు. ఆస్పత్రికి తీసుకువెళితే… కడుపులో ఓ గడ్డ ఉందని, క్యాన్సర్ అని తెలిసింది. ఎన్ని ఆస్పత్రులకు తీసుకువెళ్లినా చిన్నారికి చికిత్స అందించే ధైర్యం ఎవరూ చేయలేదని ఆమె తల్లి తెలిపారు.

    ఆ తర్వాత విజయవాడ మాజీ ఎంపీ గద్దె రామ్మోహనరావు సాయంతో  బసవతారకం ఆస్పత్రికి వెళ్లామని చెప్పారు.  ఆరోగ్య శ్రీ రాకపోయిన బాలకృష్ణ గారు దగ్గరుండి పాపకు కీమో థెరపీ చేయించారని… ఈ రోజు మా పాప ఇంత హ్యాపీగా ఉందంటే బాలయ్య గారే కారణమని తెలిపారు.  తిరుపతిలో వెంకన్న స్వామి కనపడరు కానీ బసవతారకంలో మీరు కనపడతార అని ఆ పాప తల్లి అన్నారు. “బసవతారకం ఆస్పత్రిని నేనెప్పుడు ఆస్పత్రి అనుకోనని ఒక దేవాలయంగా భావిస్తానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. నాని ఆ చిన్నారికి ఒక ల్యాప్ టాప్ బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.