Homeఆంధ్రప్రదేశ్‌AP Politics : చెన్నైలో ఆ మహానేతకి  రెండో భార్య..  ప్రముఖ నటిని పెళ్లి చేసుకున్నాడా?...

AP Politics : చెన్నైలో ఆ మహానేతకి  రెండో భార్య..  ప్రముఖ నటిని పెళ్లి చేసుకున్నాడా? నిజమెంత ?

AP Politics : ఆయన ఒక ఒక మహా నేత. నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన నాయకుడు.  సంక్షేమంతో ప్రజల మనసును గెలిచిన ఒక ఉత్తుంగ తరంగం. అందుకే ఆయన అకాల మరణంతో ఎన్నో గుండెలు ఆగిపోయాయి. తెలుగు నేల మూగబోయింది. ప్రత్యర్థులను సైతం తన చిరు నవ్వుతో చేరదీసే నైజం ఆయన సొంతం. ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం. క్రమశిక్షణకు నిలువుటద్ధం. అటువంటి మహా నాయకుడికి ఇప్పుడు ఓ మచ్చ తగిలింది. ఆయన వైవాహిక జీవితంపై ఒక అపవాదు వచ్చిపడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజకీయాలు అన్నాక ప్రత్యర్థులు సహజం. వారు చేసే విమర్శలు అంతకంటే సహజం. చిన్న తప్పిదాలను సైతం బూతద్ధంలో చూపించి పలువలు చిలువలు చేయడం కూడా సర్వ సాధారణం. అయితే ఇప్పుడు పవన్ పై జగన్ వ్యక్తిగత దాడితో చాలామంది బయటకు వస్తున్నారు. నిజాలు, నిందలివి అని బయటపెడుతున్నారు. పవన్ మూడు పెళ్లిళ్లు పై జగన్ విమర్శలు చేయడాన్ని పవన్ ను విపరీతంగా అభిమానించే వారు తట్టుకోలేకపోతున్నారు. తమకు నచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు. మరికొందరైతే సవాల్ చేస్తున్నారు.

జనసేన యాక్టివిస్టునని చెప్పుకునే ఓ జర్నలిస్టు వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. సిక్రెట్ హిస్టరీ టీవీ పేరిట తనకు తాను పరిచయం చేసుకున్న సదరు జర్నలిస్టు.. తాను  మహానేత అభిమానిని చెప్పుకున్నారు. నాడు ఎన్టీఆర్ వైవాహిక జీవితం మాట్లాడే సమయంలో వివాదాలు చుట్టుముట్టాయని.. ఆ సమయంలో ఎంపీగా ఉన్న ఆ నేత తనకు అండగా నిలిచిన విషయాన్ని సైతం గుర్తు చేసుకున్నారు.  ప్రస్తుతం తాను జనసేనలో చేరానని.. ఆ మహానేత మాదిరిగా పవన్ అంటే తనకు విపరీతమైన అభిమానంగా చెప్పుకొచ్చారు. పవన్ పై తరచూ మూడు పెళ్లిళ్లు అని కామెంట్స్ చేసినందుకే తాను ఈ విషయం బయటపెడుతున్నట్టు తెలిపారు.

తాను నమ్మిన, అభిమానించే  మహానేత గురించి  నిజాలు బయటపెట్టడం బాధగా ఉన్నా అనివార్యం అని చెప్పుకొచ్చారు. ప్రాణం మీద భయం లేకుండా వెల్లడిస్తున్నానని చెప్పుకొచ్చారు. అలనాటి తెలుగు, తమిళ నటి ఒకరితో మహానేతకి సన్నిహిత సంబంధాలుండేవని చెప్పుకొచ్చారు. ఆమెను రహస్యంగా వివాహం సైతం చేసుకున్నారని.. ఆమెతో సహజీవనం కూడా చేశారని చెప్పారు. అప్పటికే ఆమెకు వివాహం జరిగినా.. బలవంతంగా పెళ్లి చేసుకున్నారని గుర్తుచేశారు. ఈ విషయం కుటుంబసభ్యులందరికీ తెలుసునన్నారు. మహానేత తరచూ బెంగళూరు ఎందుకు వెళ్లేవారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి పవన్ వైవాహిక జీవితం గురించి ప్రస్తావిస్తే మాత్రం చాలా విషయాలు బయటపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. పవన్ పై రాయివేస్తే తాను బండరాయి వేస్తానని సవాల్ చేశారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఖచ్చితమైన ఆధారాలు లేవు. సంబంధిత వ్యక్తి నిబద్ధత గురించి కూడా అంతగా తెలియడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో చక్కెర్లు కొడుతోంది.

YouTube video player

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version