Fathers Day 2024: నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. బాధ్యతలకు మరో రూపం నాన్న. కుటుంబం కోసం పని చేసే శ్రమ జీవి. మనసులో ప్రేమ అనుభవిస్తూ పైకి పిల్లల మీద కఠినంగా వ్యవహరించే మహర్షి… మరి నాన్న మీద తెరకెక్కిన అద్భుతమైన చిత్రాలు ఏమిటో చూద్దాం..
నాన్నకు ప్రేమతో: ఈ జనరేషన్ లో వచ్చిన గొప్ప ఫాదర్ ఓరియెంటెడ్ మూవీ నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో తండ్రి రివేంజ్ కోసం పోరాటం సాగించిన కొడుకు కథను చూడొచ్చు.
హాయ్ నాన్న: నాని నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా హాయ్ నాన్న. అరుదైన వ్యాధితో బాధపడుతున్న కూతురిని కంటికి రెప్పలా కాపాడే తండ్రి కథ. కూతురు, భర్తను మర్చిపోయిన మృణాల్ ఎదుటే ఆమె కథ చెప్పడం ఈ సినిమాలో గొప్ప విషయం..
యానిమల్: ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ యానిమల్ గొప్ప ఫాదర్ అండ్ సన్ మూవీ అని చెప్పొచ్చు. తండ్రిని చంపాలని చూస్తున్న వారిపై కొడుకు చేసిన యద్దాన్ని యానిమల్ మూవీలో చూడొచ్చు. రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించాడు.
విమానం: తండ్రి కొడుకుల ఎమోషనల్ డ్రామా విమానం. చావుకు దగ్గరైన కొడుకు విమానం ఎక్కాలన చివరి కోరిక తీర్చాలని తండ్రి పడే వేదన ఈ చిత్రంలో చూడొచ్చు. సముద్ర ఖని, అనసూయ ప్రధాన పాత్రలు చేశారు.
కురంగ పెడల్: అద్భుతమైన ఫాదర్ సెంటిమెంట్ చిత్రాల్లో కురంగ పెడల్ ఒకటి. సైకిల్ నేర్చుకోవాలన్న కొడుకు కోరికను సైకిల్ నడపడం రాని ఓ తండ్రి ఎలా నేర్పాడు అనేది కథ.. మనసుకు హత్తుకుంటుంది.