https://oktelugu.com/

Tollywood Hero : ఈ కుర్రాడు అమ్మాయిల మనసు దోచిన హీరో.. ఎవరో తెలుసా?

Tollywood Heroకానీ అంతకుముందే ‘శివ మనసులో శృతి’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత ప్రేమకథా చిత్రమ్ లో నటించి అందరినీ ఆకట్టుకున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : June 16, 2024 / 08:06 PM IST

    sudheer Babu

    Follow us on

    Tollywood Hero : సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది వస్తుంటారు. కానీ కొందరు మాత్రమే ఫేవరేట్ అవుతూ ఉంటారు. కొందరు హీరోలంటే అమ్మాయిలకు బాగా ఇష్టముంటుంది. వారు అందంతో పాటు తమ నటనతో ఆకట్టుకుంటారు. అలా తన నటనతో అమ్మాయిల మనసు దోచిన ఓ హీరో హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా సినిమాల్లో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ఈయన సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో బంధువు కూడా. అయితే ఆయనకు సంబంధించిన ఓ చిన్న నాటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?

    ‘ప్రేమకథా చిత్రమ్’పేరు చెప్పగానే హీరోయిన్ నందిని గుర్తుకు వస్తుంది. కానీ ఆ నందినికే నచ్చిన కుర్రాడు సుధీర్ బాబు. సుధీర్ బాబు ఈ సినిమా నుంచి ఫేమస్ అయ్యాడు. కానీ అంతకుముందే ‘శివ మనసులో శృతి’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత ప్రేమకథా చిత్రమ్ లో నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో సుధీర్ అమాయకంగా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈమూవీ హిట్టు కొట్టడంతో సుధీర్ కు మంచి అవకాశాలు వచ్చాయ.

    అయితే హీరోగా ఎంతోకాలం నిలదొక్కుకోలేకపోయాడు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడానికి రెడీ అయ్యారు. కానీ ఇంతలోనే విలన్ కోసం సుధీర్ ను సంప్రదించగా వెంటనే ఒప్పేసుకున్నాడు. అలా బాలీవుడ్ లో ‘బాఘీ’ అనే సినిమాలో ప్రతికూల నాయకుడి పాత్రను పోషించి మెప్పించాడు. అయితే ఆ తరువాత సుధీర్ బాబు ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. కానీ ఇటీవల ఆయన ఓ సినిమాతో మరోసారి వెండితెరపై కనిపించనున్నాడు.

    సుధీర్ బాబు త్వరలో ‘హరోం హర’ సినిమాతో మరోసారి తియేటర్లో సందడి చేయనున్నాడు. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. అయితే ఇంతలో సుధీర్ బాబుకు సంబంధించిన చిన్న నాటి ఫొటో వైరల్ అవుతోంది. ఇక సుధీర్ సూపర్ స్టార్ కృష్ణకు స్వయాన అల్లుడు. మహేష్ బాబుకు బావ అవుతారు. కృష్ణ కూతురు ప్రియదర్శినికు సుధీర్ బాబు భర్త.