Amaranth Tree : హిందూ శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లను దేవతలుగా పూజిస్తారు. కొందరు దేవతలు ఈ చెట్లలో కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. వీటిలో ఉసిరి చెట్టు ప్రధాన మైనది. ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా కొలుస్తారు. అందుకే కార్తీక మాసంలో ఈ చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ప్రత్యేకంగా దీపాలు పెట్టి ఆరాధిస్తారు. చాలా ఆలయాల్లో ఉసిరి చెట్టు కనిపిస్తుంది. మరి ఉసిరి చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చా? అని కొందరికి సందేహం. ఒకవేళ పెంచాలనుకుంటే ఏ దిశ నాటాలి? అనే వివరాల్లోకి వెళితే..
ఉసిరి చెట్టుకు కార్తీక మాసంలోనే కాకుండా ఇతర రోజుల్లోనూ దైవంగా భావిస్తారు. అయితే ఉసిరి చెట్టు ఇంట్లోనే ఉండడం వల్ల అనేక లాభాలు ఉంటాయని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. ఉసిరి చెట్టు ఇంట్లో ఉండడం వల్ల కుటుం సమస్యలు తొలగిపోతాయి. ఉసిరి చెట్టుకు పూజలు మాత్రమే కాకుండా ఉసిరి కాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఉసిరి జ్యూస్ ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు. అందువల్ల చాలా మంది ఉసిరి చెట్టును పెంచుకోవాలని అనుకుంటారు. అయితే ఉసిరి చెట్టును ఏ దిశన పెంచాలి?
ఉసిరి చెట్టును పెంచాలనుకునేవారు ఇంటికి తూర్పు లేదా ఉత్తరం దిశన మొక్కను నాటుకోవాలి. అయితే ముఖ ద్వారానికి ఎదురుగా కాకుండా పక్కకు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఉసిరి చెట్టును పవిత్రంగా భావిస్తారు. అందువల్ల దీనిని ప్రత్యేక ప్రదేశంలో నాటడం వల్ల పవిత్రంగా ఉండగలుగుతుంది. కార్తీక మాసంలో వనభోజనాలు చేసేవారు ఉసిరి చెట్టు కింద భోజనం చేయడానికి ఇష్టపడుతారు. ఈ చెట్టు 8 నుంచి 18 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఉసిరి కాయలను ఆంగ్లంలో గూస్ బెర్రి అంటారు.
ఉసిరికాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు ఉసిరి ఆకులను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయి. ఉసిరి ఆకుల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి ఉసిరి ఎంతో ఉపయోగపడుతుంది.