https://oktelugu.com/

Heroines: 2021 ఏడాది ఏయే హీరోయిన్లకు కలిసొచ్చింది?

Heroines: కరోనా ఎంట్రీతో చిత్రసీమలో పరిస్థితులన్నీ తలకిందలయ్యాయి. భయభయంగానే నటీనటులంతా షూటింగుల్లో పాల్గొంటూ సినిమాలు చేస్తూ పోతున్నారు. ఇలాంటి సమయంలోనూ కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతుండటం చూస్తుంటే వారికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండుచేతులా సంపాదిస్తూ హీరోల సంపాదనకు తామేమీ తీసిపోమని హీరోయిన్లు నిరూపిస్తున్నారు. స్టార్ హీరోలు ఏడాది ఒకటి అర సినిమాలు చేస్తుంటే హీరోయిన్లు మాత్రం ఒకేసారి నాలుగైదు సినిమాలు చేస్తున్నారు. ఐటమ్ సాంగ్స్, షాపింగ్ మాల్ ఓపెన్సింగ్, […]

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2021 1:43 pm
    Follow us on

    Heroines: కరోనా ఎంట్రీతో చిత్రసీమలో పరిస్థితులన్నీ తలకిందలయ్యాయి. భయభయంగానే నటీనటులంతా షూటింగుల్లో పాల్గొంటూ సినిమాలు చేస్తూ పోతున్నారు. ఇలాంటి సమయంలోనూ కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతుండటం చూస్తుంటే వారికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండుచేతులా సంపాదిస్తూ హీరోల సంపాదనకు తామేమీ తీసిపోమని హీరోయిన్లు నిరూపిస్తున్నారు.

    Heroines

    Heroines

    స్టార్ హీరోలు ఏడాది ఒకటి అర సినిమాలు చేస్తుంటే హీరోయిన్లు మాత్రం ఒకేసారి నాలుగైదు సినిమాలు చేస్తున్నారు. ఐటమ్ సాంగ్స్, షాపింగ్ మాల్ ఓపెన్సింగ్, యాడ్స్ చేస్తూ విరివిగా సంపాదిస్తున్నారు. గ్లామర్ ఉన్నప్పుడే నాలుగురాళ్లు వెనుకేసుకోవాలనే సూత్రాన్ని నేటి హీరోయిన్లు మస్ట్ గా ఫాలో అవుతూ తోటి హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

    Also Read:  హిందీలోకి ‘అఖండ’.. అలాగే ‘అఖండ 2’ కూడా ఆగమనం !

    2021లో స్టార్ హీరోయిన్ సమంత పర్సనల్ గా ఒడిదుడులను ఎదుర్కొన్నప్పటికీ సినిమా పరంగా సత్తాచాటింది. నాగచైతన్యతో విడాకుల నుంచి త్వరగానే బయటపడిన సమంత కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే సమంత ఈ సంవత్సరం తొలి ఐటమ్ సాంగ్ చేసింది. ‘ఊ అంటావా మామా.. ఊఊ అంటావా మామా’ అంటూ చేసిన సాంగ్ నెట్టింట్లో హల్చల్ చేసింది.

    మిల్కి బ్యూటీ తమన్నా 2021లో నితిన్ తో కలిసి ‘మాస్ట్రో’ చేసింది. ఈ మూవీ ఓటీటీకే పరిమితమైంది. ఇందులో నెగిటివ్ పాత్రలో తమన్నా కన్పించడ విశేషం. గోపించంద్ తో కలిసి సిటీమార్ మూవీలో ‘జ్వాలారెడ్డి’ గా నటించింది. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా తెలంగాణ యాస నేర్చుకుంది. ఈ ఏడాది తమన్నాకు మిక్స్ డ్ గా నడిచింది.

    ‘మహానటి’ కీర్తి సురేష్ 2021లో ‘రంగ్ దే’, తమిళంలో ‘అన్నాత్తై’ సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా యావరేట్ టాక్ తెచ్చుకున్నాయి. లేడి ఓరియంటేడ్ మూవీగా తెరకెక్కిన ‘గుడ్ లక్ సఖి’ వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబర్ 31న ఈ మూవీ రిలీజు అయ్యే అవకాశం కన్పిస్తోంది.

    కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న శృతిహాసన్ ఈ ఏడాది ‘వకీల్ సాబ్’ లో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే రవితేజ సరసన ‘క్రాక్’ మూవీలో నటించింది. ఈ రెండు సినిమలు కూడా హిట్ కావడంతో తెలుగులో ఆమెకు మల్లీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

    2021లో పూజాహెగ్దే హవా నడిందనే చెప్పాలి. కాల్షీట్లు దొరకలేనంత బీజీగా మారిపోయింది. ఈ ఏడాది అఖిల్ తో నటించిన ‘మోస్ట్ ఎలిబిబుల్ బ్యాచిలర్’ పూజాకు మంచి విజయాన్ని అందించింది. ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’, చరణ్ తో కలిసి ‘ఆచార్య’, తమిళంలో ‘విజయ్’ సరసన నటించింది. ఈ సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

    ‘పుష్ప’తో రష్మిక మందన్న తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. స్టార్ హీరోయిన్ అనుష్క ఈ ఏడాది ‘నిశబ్దం’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేదు. రకుల్ ప్రీత్ సింగ్ ‘చెక్’,‘కొండపొలం’ సినిమాల్లో నటించింది. ఈ రెండు కూడా ప్లాపు సినిమాలుగానే మిగిలాయి. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ కే పరిమితమైంది.

    Also Read: బిగ్ న్యూస్.. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతంలో’ చెర్రీ, తారక్..