Balakrishna Police Case Against Prashanth Varma: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పై ఇప్పటికే టాలీవుడ్ లో అనేక ఆరోపణలు ఉన్నాయి. వివిధ నిర్మాతల నుండి భారీ అడ్వాన్స్ లు తీసుకున్నాడని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్ట్స్ మొదలు పెట్టలేదని, సరిగా రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదని పెద్ద రచ్చ జరిగింది. దీనిపై ప్రశాంత్ వర్మ కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా ప్రశాంత్ వర్మ పై పోలీస్ కేసు వెయ్యడానికి సిద్ధం అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ తో బాలయ్య కి మంచి రిలేషన్ ఉండేది. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఆ సమయం లోనే అతని పని తీరు బాలయ్య కి బాగా నచ్చింది. అదే సమయం లో ‘హనుమాన్’ చిత్రం విడుదల అవ్వడం, అది కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడంతో బాలయ్య ప్రశాంత్ వర్మ ని సంపూర్ణంగా నమ్మాడు.
నమ్మి తన కొడుకు మోక్షజ్ఞ తేజ మొదటి సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతలను అప్పగించాడు. మరో రెండు రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుందని అనుకుంటుండగా, ప్రశాంత్ వర్మ ఈ సినిమా నుండి తప్పుకొని , తన శిష్యుడిని ఈ చిత్రానికి దర్శకత్వం వహించేలా చేస్తానని బాలయ్య కి చెప్పాడట. ఈ ప్రతిపాదనకు బాలయ్య ససేమీరా నో చెప్పాడట. చేస్తే నువ్వే దర్శకత్వం చెయ్యాలి, లేదంతే వద్దు అని ముఖం మీదనే చెప్పేశాడట. అంతకు ముందు బాలయ్య ప్రశాంత్ వర్మ కి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం కోసం పాతిక కోట్ల రూపాయిలు కూడా ఇచ్చాడట. డబ్బులు తీసుకొని, షూటింగ్ మొదలు అయ్యే సమయానికి ఆయన తప్పుకోవడం బాలయ్య కి చిర్రెత్తేలా చేసింది. ప్రశాంత్ వర్మ ని చాలా గట్టిగానే ఆయన వారించినట్టు కూడా సమాచారం.
బాలయ్య స్టైల్ లో వారించడం అంటే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోగలరు. ఇదంతా జరిగిన తర్వాత కూడా ప్రశాంత్ వర్మ నుండి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. తన పని తానూ చేసుకుంటూ పోతున్నాడు. రిషబ్ శెట్టి తో ‘జై హనుమాన్’ చిత్రాన్ని నిర్మిస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. ఇది బాలయ్య కి అసలు నచ్చలేదు, ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంటే సహించేది లేదు అని వార్నింగ్ ఇచ్చి, పోలీస్ స్టేషన్ లో ప్రశాంత్ వర్మ పై కేస్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడట. ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్లి అఆగుతుందో చూడాలి. మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా ఇప్పుడు ఎవరితో ఉంటుంది అనే డైలమా అభిమానుల్లో ఉంది. ఇప్పటికే ఆయన వెండితెర అరంగేట్రం చాలా ఆలస్యం అయ్యింది. ఈ గొడవలు చూస్తుంటే మరో ఏడాది పాటు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపించడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.