https://oktelugu.com/

Tollywood 2021 Round Up: ఈ ఏడాది ఫస్ట్ డే.. అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలివే..

Tollywood 2021 Round Up: కరోనా కారణంగా సినిమా రంగం కుదేలయింది. 2020 ఫిబ్రవరిలో దేశంలో కరోనా ఆరంభంతో దాదాపు 9 నెలల పాటు సినిమా థియేటర్లు మూతపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత కాస్త కుదుటపడ్డాక తెరుచుకున్న థియేటర్లోకి ఫాస్ట్..ఫాస్ట్ గా సినిమాలు వచ్చాయి. వచ్చీ రాగానే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాయి. దేశంలో ఏ ఇండస్ట్రీకి లేనంతగా రికార్డు కలెక్షన్లు తెలుగు సినిమాలకు వచ్చాయి. దీంతో ఇక సినిమా రంగానికి పూర్వ వైభవం వచ్చింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2021 / 12:31 PM IST
    Follow us on

    Tollywood 2021 Round Up: కరోనా కారణంగా సినిమా రంగం కుదేలయింది. 2020 ఫిబ్రవరిలో దేశంలో కరోనా ఆరంభంతో దాదాపు 9 నెలల పాటు సినిమా థియేటర్లు మూతపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత కాస్త కుదుటపడ్డాక తెరుచుకున్న థియేటర్లోకి ఫాస్ట్..ఫాస్ట్ గా సినిమాలు వచ్చాయి.

    2021-highest-collections-movies

    వచ్చీ రాగానే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాయి. దేశంలో ఏ ఇండస్ట్రీకి లేనంతగా రికార్డు కలెక్షన్లు తెలుగు సినిమాలకు వచ్చాయి. దీంతో ఇక సినిమా రంగానికి పూర్వ వైభవం వచ్చింది. అయితే సెకండ్ వేవ్ విజృంభించిన తరువాత మళ్లీ థియేటర్లు మూతపడ్డాయి. అయితే జూలై చివరి వారం నుంచి ప్రారంభమైనా కాస్తో కూస్తో.. అన్నట్లుగా నడుస్తున్నాయి.

    Tollywood 2021 Round Up

    సినిమా పెద్దదైనా.. చిన్నదైనా ఫస్ట్ డే కలెక్షన్ ప్రభావం ఆ సినిమాపై పడుతుంది. కొన్ని సినిమాలు మొదటి రోజే పెట్టుబడిని రాబట్టుకునే విధంగా వసూలు చేసుకుంటాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు వచ్చిన సినిమాలు మంచి కలెక్షన్లు సాధించాయి. కానీ సెకండ్ వేవ్ తరువాత ఢీల పడ్డాయి. కొంతమంది కరోనా థర్డ్ వేవ్ కు భయపడి ఓటీటీ ద్వారా సినిమాలు రిలీజ్ చేశారు. దీంతో పెట్టుబడికి స్వల్ప లాభం మాత్రమే చూసుకున్నారు. అయితే కాస్త డేర్ చేసి థియేటర్లో రిలీజ్ చేసినా ఫస్ట్ డే కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి.. అయితే ఈ సంవత్సరం విడుదలయిన ఏయే సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్షన్లు కొల్లగొట్టిందో ఒకసారి చూద్దాం..

     

    Also Read: ‘పుష్ప’ లేటెస్ట్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !
    1. వకీల్ సాబ్:
    పవన్ కల్యాణ్ రీఎంట్రీగా వచ్చిన సినిమా ‘వకీల్ సాబ్’. అప్పటికే ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కు పవన్ మంచి బిర్యానే తినిపించాడు. సినిమా రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సినిమాను తీర్చి దిద్దడంలో సక్సెస్ అయ్యారు. దీంతో సినిమా సక్సెస్ అవడంతో పాటు మంచి కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.36.46 కోట్ల వసూలు సాధించింది.

    2. పుష్ప:
    సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషనల్లో వచ్చిన మాస్ మూవీ ‘పుష్ప’ ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజైంది. మొదటి రోజు కలెక్షన్ రూ.36.72 కోట్లు సాధించింది. అయితే ఆ తరువాత కాస్త స్లో రేటుతో మూవ్ అయింది.

    3.అఖండ:
    చాలా రోజుల తరువాత మళ్లీ బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’కు మొదటి రోజనుంచే మంచి టాక్ వచ్చింది. మొదటి రోజు ఈ సినిమా రూ.18.04 కోట్లు సాధించింది. అయితే ఆ తరువాత సినిమాపైక్రేజ్ పెరగడంతో కలెక్షన్లలో దూసుకుపోతుంది.

    4. ఉప్పెన:
    మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి మరో హీరో వైష్ణవ్ తేజ్-కృతి శెట్టి జంటగా వచ్చిన ‘ఉప్పెన’ మొదటి రోజు వరల్డ్ వైడగ్ రూ.10.42 కోట్లు సాధించింది. మొత్తంగా రూ.50 కోట్ల షేర్ ను గ్రాస్ చేసింది.

    5. లవ్ స్టోరీ:
    శేఖర్ కమ్ముల మైండ్ నుంచి వచ్చిన మరో మూవీ ‘లవ్ స్టోరీ’ నాగచైతన్య-సాయిపల్లవి జంటగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ 9.31 కోట్లు. అయితే ఆ తరువాత సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్లు నామమాత్రంగానే వసూలు చేసింది.

    Also Read:  త్రివిక్రమ్​- మహేశ్​ కాంబో సరికొత్త అప్​డేట్​.. దుబాయ్​లో సినమాకు శ్రీకారం!