Dhurandhar 2 Movie Story: గత ఏడాది డిసెంబర్ నెలలో భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం 50 రోజులు పూర్తి చేసుకొని , ఇప్పటికీ థియేటర్స్ లో దిగ్విజయంగా రన్ అవుతూ ఉంది. ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ రన్ ని బాలీవుడ్ ట్రేడ్ చూసి చాలా కాలమే అయ్యింది. స్పై యాక్షన్ థ్రిల్లర్స్ కి కాలం చెల్లిపోతున్న సమయంలో వచ్చిన ఈ సినిమా, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం వల్ల ఈ జానర్ సినిమాలకు సరికొత్త ఊపు వచ్చింది. శత్రు దేశమైన పాకిస్థాన్ లో ఉగ్రవాద సంస్థలను సమూలంగా నాశనం చేసేందుకు భారత ఇంటెలిజెన్స్ బీయూరో చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ నేపథ్యం లో ‘ధురంధర్’ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. హీరో రణవీర్ సింగ్(Ranveer Singh) తో పాటు, విలన్ గా నటించిన అక్షయ్ ఖన్నా(Akshay Khanna) కూడా అద్భుతంగా నటించడం తో ఈ సినిమా రేంజ్ ఎవ్వరూ ఊహలకు అందనంత ఎత్తుకి వెళ్ళింది.
ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 1300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుండి 880 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. 900 కోట్ల ప్రతిష్టాత్మక బెంచ్ మార్క్ ని ఈ సినిమా రాబోయే రోజుల్లో అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇదంతా పక్కన పెడితే ‘ధురంధర్ 2’ చిత్రం స్టోరీ మొత్తం ప్రతీకారం చుట్టూ తిరుగుతుంది అట. మెయిన్ థీమ్ స్పై జానర్ లాగానే ఉంటుంది కానీ, రివెంజ్ బ్యాక్ డ్రాప్ కూడా కథకు అత్యంత కీలకం అట. అందుకే ఈ సినిమాకు ‘దురంధర్ 2 : ది రివెంజ్'(Dhurandhar 2 : The Revenge) అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఈ నెల 23వ తేదీన విడుదల చేయబోతున్నారు మేకర్స్.
ఈ చిత్రాన్ని మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. టీజర్ కూడా అన్ని భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఇకపోతే ఈ సినిమాలో ‘చావా’ హీరో విక్కీ కౌశల్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని లేటెస్ట్ గా బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే ‘ధురంధర్ ‘ చిత్రం అంత పెద్ద కమర్షియల్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం, ఇందులో స్పై థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వేరే లెవెల్ లో వర్కౌట్ అవ్వడం వల్లే, అలాంటిది సీక్వెల్ లో రివెంజ్ వైపు వెళ్తే ఆడియన్స్ రొటీన్ ఫీల్ అవుతారేమో అనే భయం అభిమానుల్లో ఉంది. కానీ అలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదని , ‘ధురంధర్ 2’ స్టోరీ లో 3000 కోట్లు కొట్టేంత సత్తా ఉందని అంటున్నారు మేకర్స్.