https://oktelugu.com/

Siddharth: సీఎం రేవంత్ రెడ్డి విషయంలో సిద్ధార్త్ చేసిన పెద్ద తప్పు ఇదే.. ఇప్పుడు లెంపలేసుకుంటే ఏం లాభం..?

రీసెంట్ గా 'భారతీయుడు 2' సినిమా యూనిట్ క్యూ అండ్ ఏ ప్రోగ్రాం ను నిర్వహించారు. అందులో ఒక రిపోర్టర్ ఈ మధ్య కొత్త సినిమా టికెట్ రేట్లు పెంచడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆ సినిమాలోని నటులు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఏదైనా వీడియో చేస్తే టికెట్ రేట్లు పెంచుతామని చెబుతున్నాడు. మీరు దానికి సిద్ధమేనా అంటూ అడగగా దానికి సిద్ధార్థ్ సమాధానంగా నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీలయ్యి అందరూ కండోమ్స్ వాడండి అంటూ ఒక ఆడ్ చేశాను.

Written By:
  • Gopi
  • , Updated On : July 9, 2024 / 10:57 AM IST

    Siddharth

    Follow us on

    Siddharth: ప్రస్తుతం సినిమా ప్రమోషన్ల కోసం రిపోర్టర్లతో సినిమా యూనిట్ కలిసి క్యూ అండ్ ఏ అనే ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో రిపోర్టర్స్ వాళ్లకు ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడుగుతుంటే సినిమా యూనిట్ మాత్రం చాలా డీసెంట్ గా సమాధానం ఇస్తూ ఉంటారు. ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది రిపోర్టర్ల పైన సినిమా యూనిట్ ఫైర్ అయిన సందర్భాలను కూడా మనం చూశాం. ఇక ఈ రిపోర్టర్లు సినిమాకు సంబంధించిన క్వశ్చన్స్ అడగకుండా వాళ్ళ పర్సనల్ కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉండటం వల్ల ఇలాంటి సిచువేషన్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి.

    ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ‘భారతీయుడు 2’ సినిమా యూనిట్ క్యూ అండ్ ఏ ప్రోగ్రాం ను నిర్వహించారు. అందులో ఒక రిపోర్టర్ ఈ మధ్య కొత్త సినిమా టికెట్ రేట్లు పెంచడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆ సినిమాలోని నటులు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఏదైనా వీడియో చేస్తే టికెట్ రేట్లు పెంచుతామని చెబుతున్నాడు. మీరు దానికి సిద్ధమేనా అంటూ అడగగా దానికి సిద్ధార్థ్ సమాధానంగా నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీలయ్యి అందరూ కండోమ్స్ వాడండి అంటూ ఒక ఆడ్ చేశాను.

    మా ఆర్టిస్టులందరికీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటూ తను మాట్లాడాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఇది ఎలా కన్వే అయింది అంటే సినిమా యూనిట్ ఏదైనా వీడియో చేస్తేనే సీఎం టికెట్ రేట్లు పెంచుతాను అన్నాడు. కానీ ఆయన చెప్పక ముందు నుంచే మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాము అంటూ సిద్ధార్థ్ మాట్లడినట్టుగా కన్వే అయింది. ఇక దర్శక నిర్మాతలు వాటి ద్వారా తమ సినిమాకి ఏదైనా భారీ ముప్పు జరగవచ్చని సిద్ధార్థ్ కి చెప్పినట్టు ఉన్నారు. దానివల్ల ఈ ఈవెంట్ మొత్తం ముగిసిన తర్వాత సిద్ధార్థ్ తను ఆ విషయం మీద వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరమైతే వచ్చింది. నేను వారి విధానానికి వ్యతిరేకం కాదు సీఎం గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది.

    నేను ఆ నిర్ణయంతో ఏకీభవిస్తున్నాను నేను చెప్పిన విషయం వేరు అక్కడ కన్వే అయినా విషయం వేరు అంటూ సిద్ధార్థ్ వివరణ ఇచ్చాడు. ఇక అందరూ భారతీయుడు 2 సినిమా చూడండి చాలా బాగుంటుంది అని చెబుతూనే, నేను ఎవరినైనా హర్ట్ చేసుంటే సారీ అని కూడా చెప్పాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సారి ఎవరికీ చెబుతున్నాడు అనే విషయం మీద పలు రకాల కథనాలైతే వెలుబడుతున్నాయి. ఈ ప్రోగ్రాం లో రిపోర్టర్ల మీద కొంతవరకు దురుసుగా సమాధానం చెప్పిన సిద్ధార్థ్ ఆ రిపోర్టర్లకు ఈ సారీ చెప్తున్నాడేమో అంటూ మరి కొంతమంది సమాధానం ఇస్తున్నారు… ఇక ఇది చూసిన ఇంకొంతమంది మాత్రం ముందుగా అలాంటి మాటలు మాట్లాడడం ఎందుకు మళ్ళీ సారీ చెప్పడం ఎందుకు… పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు కొంచెం ఆలోచించి సమాధానం చెప్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు…