Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వదులుకున్న ఆ సినిమా ఒక చిన్న హీరో కి లైఫ్ ఇచ్చిందనే విషయం మీకు తెలుసా..?

పవన్ కళ్యాణ్ వదులుకున్న ఒక సినిమాని ఒక చిన్న హీరో చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. నువ్వే కావాలి అనే సినిమాని తరుణ్, రిచా కాంబినేషన్ లో తెరకెక్కి ఒక సూపర్ సక్సెస్ గా నిలిచింది.

Written By: Gopi, Updated On : June 27, 2024 6:21 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి. కెరియర్ స్టార్టింగ్ లో ఆయన వరుసగా 7 సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకొని ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాని రీతిలో ఒక అరుదైన రికార్డు ను కూడా సొంతం చేసుకున్నాడు. ఒక మొత్తానికైతే ఆయన స్టార్ హీరోగా ఎదగడంలో ఈ ఏడు సినిమాలే కీలకపాత్ర వహించాయని చెప్పాలి.

ఇక ఆయన చేసిన ఏడు సినిమాల్లోనే ఒకటి ఇండస్ట్రీ హిట్ ఉండగా, మూడు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు ఉన్నాయి. ఇక ఆపవన్ కళ్యాణ్ ఎన్టీయార్ కెరియర్ లో ఆయన వదులుకున్న సినిమాలు పదుల సంఖ్యలో ఉంటాయి. ఇక వాటిలో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని ఫెయిల్యూర్ గా నిలిచాయి. ఇక పవన్ కళ్యాణ్ వదులుకున్న ఒక సినిమాని ఒక చిన్న హీరో చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. నువ్వే కావాలి అనే సినిమాని తరుణ్, రిచా కాంబినేషన్ లో తెరకెక్కి ఒక సూపర్ సక్సెస్ గా నిలిచింది.

అదే సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జే సూర్య డైరెక్షన్ లో అమీషా పటేల్ ను హీరోయిన్ గా పెట్టి ఈ సినిమా చేయాలని ప్లాన్ చేశారు.ఇక ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తయినప్పటికీ ఆ తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. ఇక మళ్ళీ ఈ సినిమాని చేద్దామని ఎస్ జే సూర్య అడిగినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం వద్దని చెప్పారట. ఇక దాంతో వీళ్ళ కాంబినేషన్ లో ఖుషి అనే ఒక సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీ హిట్ కూడా దక్కింది.

ఇక ఆ తర్వాత కాలంలో ఈ కథతోనే నువ్వే కావాలి సినిమాని విజయభాస్కర్ చేసి సక్సెస్ సాధించాడు. ఇక ఈ సినిమాతోనే తరుణ్ కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు…ఇక పవన్ కళ్యాణ్ వదులుకున్న ఈ సినిమా ఒక సూపర్ సక్సెస్ సాధించిందనే చెప్పాలి…