Tollywood: హిట్ ప్లాప్ లు పక్కన పెడితే ప్రతివారం ఎప్పటిలాగే నాలుగైదు సినిమాలు పోటీకి దిగుతున్నాయి. అయితే, వచ్చిన ప్రతి సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా తుస్సుమనిపిస్తోంది. గత వారం కూడా మూడు చిత్రాలు భారీ స్థాయిలో రిలీజ్ అయ్యాయి. కట్ చేస్తే.. బాక్సాఫీస్ వద్ద అన్ని సినిమాలకు కనీస కలెక్షన్స్ కూడా రాలేదు. చివరకు అంచనాలు ఉన్న చిత్రాలు కూడా వసూలు చేయలేక చేతులెత్తేస్తున్నాయి అంటే.. ఇక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయినా, హిట్టో, ఫట్టో తర్వాత సంగతి, ప్రతీవారం చిన్నాచితకా చిత్రాలతో కలిపి మీడియం రేంజ్ సినిమాల జాతర తెలుగు బాక్సాఫీస్ ముందు గట్టిగానే కొనసాగుతుంది. కానీ వచ్చిన మీడియం రేంజ్ సినిమాలకు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఈ మధ్య ఒక సినిమా బాగుంది అన్నా జనం థియేటర్ మొహం చూడడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు.
ఒకప్పుడు పర్వాలేదు అనే సినిమాకు కూడా మంచి కలెక్షన్స్ వచ్చేవి. కానీ, కరోనా పుణ్యమా అని బాగున్న సినిమాకు కూడా కలెక్షన్స్ వచ్చేదాకా నమ్మకం లేకుండా పోయింది. ఇక ఈ వారం కూడా ఒకేసారి ఏకంగా 8 సినిమాలు రాబోతున్నాయి. అన్నీ చిన్న చిత్రాలే. అందులో ఒకటి నేరుగా ఓటీటీలో రిలీజ్ కి ముస్తాబు అయింది.
ఇంతకీ ఆ 8 చిత్రాల లిస్ట్ చూస్తే.. ‘రావణలంక, అసుర్, స్ట్రీట్ లైట్, మిస్టర్ లోన్లీ, ఊరికి ఉత్తరాన, సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి, పోస్టర్ చిత్రాలు ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఇక అద్భుతం అనే సినిమా హాట్ స్టార్ ద్వారా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. అయితే, తెలుగు థియేటర్స్ పై బాక్సాఫీస్ పై అవగాహన ఉన్న ఒక జర్నలిస్ట్ గా.. ఈ చిత్రాల్లో సగం చిత్రాలు పోస్ట్ ఫోన్ అవ్వడం ఖాయం.
Also Read: Suriya: సూర్యకే తమ సపోర్ట్.. పోటీ పడుతున్న సెలబ్రిటీలు !
కానీ, సగం చిత్రాలు పోస్ట్ ఫోన్ అయినా, ఈ వారం కనీసం నాలుగు సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ పోటీలో ఏ చిత్రం తన సిత్రాలు చూపిస్తోంది చూడాలి. ఇంతకీ ఈ చిన్న సినిమాలన్నీ ఇలా ఉన్నపళంగా రిలీజ్ అయిపోవాలని ఉత్సాహ పడటానికి గల కారణం.. ఈ వారం దాటితే ఇక ఎబౌవ్ మీడియం రేంజు సినిమాల హడావుడి మళ్లీ బలంగా మొదలవ్వనుంది. ఆ తర్వాత పెద్ద సినిమాల రాక ఉండనుంది.
Also Read: Prabhas: ప్రభాస్ ఫ్యాన్సే.. ప్రభాస్ సినిమా పై నెగిటివ్ ప్రచారమా ?