Balayya: బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో అదిరిపోయిందని.. బాలయ్య ఓపెన్ నెస్ కి ఫిదా అయిపోయామని యాంటీ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఈ షోలో బాలయ్య టైమింగ్ కంటే కూడా జనానికి బాగా నచ్చిన అంశం.. బాలయ్యలో మరో కొత్త మనిషిని చూడటం. ఎవరైనా తనకు అతి దగ్గరగా వస్తే బాలయ్యకు కోపం అని బయట బాగా టాక్ ఉంది.

అయితే, ఇప్పటి వరకు జరిగిన అన్ స్టాపబుల్ రెండు ఎపిసోడ్స్ లో బాలయ్య ఆపదలో ఉన్న చిన్నారులకు సాయం చేసి వాళ్ళను అక్కున చేర్చుకున్న విధానం అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా నాని గెస్ట్ గా వచ్చిన షోలో బాలయ్యకు ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఆ చిన్నారి పరిగెత్తుకుంటూ వచ్చి బాలయ్యను హాగ్ చేసుకుంది.
బాలయ్య కూడా ఆ చిన్నారిని హత్తుకుని సొంత కుమార్తెలా ఆ పాపను ముద్దు చేశాడు. ఈ సందర్భంగా బాలయ్య ఆ పాప తల్లితో అన్న మాట. నేను బసవతారకం ఆసుపత్రిని ఒక దేవాలయంగా భావిస్తాను అని. ఈ మాటతో బాలయ్యకు హాస్పిటల్ పై ఎంత నిబ్బద్దత ఉందో అర్ధం అవుతుంది. చిన్న సాయం చేసి పెద్ద పబ్లిసిటీ చేసుకునే ఈ రోజుల్లో.. నిత్యం ఎందరో పేదలకు ఉచిత వైద్యం అందిస్తూ పదుల సంఖ్యలో ప్రాణాలను కాపాడుతున్నా.. ఎన్నడూ పబ్లిసిటీ చేసుకోకపోవడం నిజంగా గొప్ప విషయమే.
అదేంటో గానీ, పవన్ కళ్యాణ్ లక్ష సాయం చేసినా, మహేష్ బాబు ఒక చిన్నారికి గుండె ఆపరేషన్ చేసినా, చిరంజీవి అభిమానికి చిన్నపాటి ఆర్థిక సాయం చేసినా.. చివరకు విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరో యాభై వేలు ఖర్చు పెట్టి సేవ చేసినా బయట ప్రపంచానికి ఇట్టే తెలిసిపోతుంది. అన్నీ వెబ్ సైట్స్ లో, పేపర్స్ లో గొప్ప కథనాలుగా వస్తాయి. కారణం.. పీఆర్వో టీం. ప్రతి హీరోకి ఒక పీఆర్వో టీమ్ ఉంది.
వాళ్లే తమ హీరో ఇమేజ్ ను పెంచడానికి అన్ని రకాలుగా చేయాల్సిన పబ్లిసిటీ చేస్తారు. కానీ, బాలయ్యకు ప్రత్యేకంగా పీఆర్వో టీమ్ లేదు. ఇక చేసిన మంచిని అసలు పబ్లిసిటీ చేసుకోడు. అంతెందుకు సోషల్ మీడియా కూడా ఫాలో అవ్వడు. మొత్తమ్మీద బాలయ్య ఓ ప్రత్యేకమైన వ్యక్తి.. మంచి మనసు ఉన్న గొప్ప మనిషి. అందుకే, బాలయ్య ఎప్పుడూ గొప్పోడేనయ్యా
Also Read: Suriya: సూర్యకే తమ సపోర్ట్.. పోటీ పడుతున్న సెలబ్రిటీలు !
ఇక బాలయ్య అన్ స్టాపబుల్ విషయానికి వస్తే.. మూడో గెస్ట్ గా.. విజయ్ దేవరకొండ రాబోతున్నాడు. అలాగే క్రిష్, పూరి జగన్నాథ్ లు కూడా గెస్ట్ లుగా రానున్నారు. అదేవిధంగా చిరంజీవి కూడా గెస్ట్ గా రానున్నాడు. బహుశా ఇది చివరి ఎపిసోడ్ కావోచ్చు.
Also Read: Prabhas: ప్రభాస్ ఫ్యాన్సే.. ప్రభాస్ సినిమా పై నెగిటివ్ ప్రచారమా ?