https://oktelugu.com/

Aishwarya Dhanush: ఐశ్వర్య ధనుష్ విడాకులు తీసుకోవడానికి ఆ స్టార్ మ్యూజిక్ డైరక్టరే కారణమా..?

ధనుష్ కూడా దానికి అంగీకరించక తప్పలేదట.. ఇక మొత్తానికైతే చాలా సంవత్సరాల పాటు మంచి కపుల్స్ గా పేరు పొందిన వీళ్లు విడిపోవడం అనేది చాలా మంది ధనుష్ అభిమానులను అలాగే రజనీకాంత్ అభిమానులను కూడా తీవ్ర మనోవేదనకు గురి చేసిందనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : April 7, 2024 5:35 pm
    Aishwarya Dhanush

    Aishwarya Dhanush

    Follow us on

    Aishwarya Dhanush: ప్రస్తుతం సినిమా నటుల జీవితాలు స్క్రీన్ మీద మనకు కనిపించినంత అందంగా మాత్రం ఉండటం లేదు. దానికి కారణం వాళ్ల పర్సనల్ లైఫ్ లో చాలా రకాల కష్టాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న చాలామంది సెలబ్రిటీలు వాళ్ల మధ్య వచ్చిన విభేదాలను పరిష్కరించుకోలేక దానికి విడిపోవడమే అంతిమ పరిష్కారంగా నిర్ణయించుకొని విడాకులు తీసుకోవడానికి ఫిక్స్ అయిపోతున్నారు. ఇక ఇప్పటికే చాలామంది సినిమా హీరోలు, హీరోయిన్లు విడాకులు తీసుకున్నారు. ఇక అందులో కొందరు మళ్లీ పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఇప్పటికి సోలో గానే తమ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించుకున్న నాగచైతన్య సమంతల వివాహ బంధం కూడా ఎక్కువ రోజులు నిలువలేదు.

    ఇక దానికి తగ్గట్టుగానే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో ధనుష్ తన భార్య అయిన ఐశ్వర్య రజనీకాంత్ పెళ్లి బంధం దాదాపు 20 సంవత్సరాల తర్వాత విడాకులుగా మారిన విషయం మనకు తెలిసిందే. ఇక వీళ్లకు ఒక పాప, బాబు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి క్రమంలో వీళ్ళు విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటూ చాలా కథనాలు అయితే వచ్చాయి. దానికి ఐశ్వర్య రజనీకాంత్ ధనుష్ తో ఉండలేకే తను విడాకులు కోరినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక దీనికి ముందు కూడా వీళ్ళ మధ్య చాలాసార్లు విడాకుల ప్రస్తావన వచ్చిందట. కానీ రజినీకాంత్ తన సన్నిహితులైన కొంతమంది తో చెప్పించి వాళ్ల మైండ్ సెట్ మార్చినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.

    ఇక అందులో భాగంగా మలయాళం స్టార్ హీరో అయిన మోహన్ లాల్ కూడా ఒకసారి వీళ్ళతో మాట్లాడి వీళ్ళ మైండ్ సెట్ ని సెట్ చేశారట…ఇక ఒక సమయం లో ఎంత మంది చెప్పిన కూడా వినకుండా వీళ్ళు విడాకులైతే తీసుకున్నారు. ఇక వీళ్ళు విడిపోవడానికి ముఖ్య కారణం అప్పట్లో ‘ సుచీ లీక్స్’ పేరుతో కొన్ని వీడియోలు బయటికి రావడం దాంట్లో ధనుష్, అనిరుధ్ చేసిన పనులు జనానికి తెలియడం వల్లే ఐశ్వర్య ధనుష్ తో ఉండలేక విడిపోవాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి మరి ఆయనతో విడాకులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ధనుష్ కూడా దానికి అంగీకరించక తప్పలేదట.. ఇక మొత్తానికైతే చాలా సంవత్సరాల పాటు మంచి కపుల్స్ గా పేరు పొందిన వీళ్లు విడిపోవడం అనేది చాలా మంది ధనుష్ అభిమానులను అలాగే రజనీకాంత్ అభిమానులను కూడా తీవ్ర మనోవేదనకు గురి చేసిందనే చెప్పాలి…ఇక కొంతమంది ధనుష్ అభిమానులు మాత్రం అనిరుధ్ వల్లే ధనుష్ పర్సనల్ లైఫ్ ఇలా అయిందంటూ ఇప్పటికీ సోషల్ మీడియా లో కామెంట్లు కూడా చేస్తుంటారు…