Malashri: ఒకప్పటి అందాల హీరోయిన్ మాలా శ్రీ కి ఇంత పెద్ద కొడుకున్నాడా..? వైరల్ ఫోటోలు…

ప్రస్తుతం చాలా మంది నటి నటులు వాళ్ల వారసులను ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్నారు. నిజానికి వారసత్వం గా ఎంత మంది హీరోలు వచ్చిన కూడా వాళ్ల దగ్గర టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీ లో నిలబడుతారు. ఒకవేళ టాలెంట్ లేకపోతే మాత్రం వాళ్ళు షెడ్డు కు వెళ్లి పోవాల్సిందే...

Written By: Gopi, Updated On : July 23, 2024 4:46 pm

Malashri

Follow us on

Malashri: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ఇండస్ట్రీలో స్టార్లుగా వెలుగొందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్ల లో మాలా శ్రీ ఒకరు. ఈమె తన హావా భావాలతో అప్పటి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. కామెడీ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఇవివి సత్యనారాయణ తీసిన ‘ప్రేమ ఖైదీ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈవిడ.. ఆ తర్వాత భలే మామయ్య, వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సాహస వీరుడు సాగర కన్య’ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇంక తన మొదటి చిత్రంతోనే కుర్ర కారు హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. అందుకే అప్పట్లో మాలా శ్రీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే తెలుగు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఇక అదే సమయంలో ఆమెకి కన్నడలో కూడా భారీ ఆఫర్లు వచ్చాయి. ఇక అక్కడ వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందడంతో ఆమె ఎక్కువ కన్నడ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించింది. ఇక ఆమె తెలుగులో చివరగా ‘సూర్య పుత్రులు’ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత నుంచి ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. ఇక కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాను అందుకోవడమే కాకుండా ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన రాము ను పెళ్లి చేసుకుంది. ఇక వీళ్ళిద్దరికీ అనన్య, ఆర్యన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. దురదృష్టవశాత్తు 2021 వ సంవత్సరంలో కరోనా కారణంగా రాము మరణించారు.

malashri son

ఇక అప్పటినుంచి పిల్లలిద్దరి బాగోగులను తనే చూసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే అనన్య , ఆర్యన్ ఇద్దరిని కూడా సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలనే ఆలోచన లో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన దర్శన్ హీరోగా వచ్చిన ‘కాటీరా ‘అనే సినిమాతో అనన్య హీరోయిన్ గా పరిచయమైంది. అయితే ఈ సినిమా కన్నడలో సూపర్ సక్సెస్ అయింది. దాంతో మొదటి సినిమాతోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అనన్యకి ప్రస్తుతం భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తన కొడుకు అయిన ఆర్యన్ కూడా సినిమా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే హింటు ఇస్తూ ఆర్యన్ వర్కౌట్ చేస్తున్న ఒక ఫోటోని కూడా మాలా శ్రీ తన ఇన్ స్టా ద్వారా షేర్ చేసింది.

ఇంకా ఈ ఫోటోలో ఆర్యన్ వర్కౌట్ చేస్తూ కనిపిస్తున్నాడు. హైట్ లో గాని, వెయిట్ లో గాని, బాడీలో గాని యాక్టింగ్ స్కిల్స్ గాని తను హీరోలకు ఏమాత్రం తీసిపోడట.. అందువల్లే ఆయనను సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలని మాలా శ్రీ అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం విదేశాల్లో చదువులను కొనసాగిస్తున్న ఆయన అవి ముగించుకున్న వెంటనే సినిమా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నాడు అంటూ మాలా శ్రీ తన సన్నిహితుల దగ్గర తెలియజేస్తున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి…

ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన మాలా శ్రీ తన కొడుకు, కూతురు ఇద్దరిని కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావడం అనేది నిజంగా మంచి విషయమనే చెప్పాలి. తను నటిగా ఉన్నప్పటికీ తన పిల్లల్ని కూడా ఇండస్ట్రీ కి తీసుకు రావాలని తను తాపత్రయపడటాన్ని చూస్తున్న వాళ్లు మాలా శ్రీ మంచి పని చేస్తుందంటూ తనను ఎంకరేజ్ చేస్తున్నారు…