Rambha Daughter
Rambha Daughter: హీరోయిన్ రంభ ఈ పేరు తెలియని వారు ఉండరు. ఒకప్పుడు సౌత్ అండ్ నార్త్ అనే తేడా లేకుండా ఇండియా సినిమాను ఏలింది. రంభ విజయవాడకు చెందిన తెలుగమ్మాయి. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. 15 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆమె మొదట ఒక మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేసింది. తొలి చిత్రమే సూపర్ హిట్ అవడంతో ఆఫర్లు వెల్లువెత్తాయి.ఇ వి వి సత్యనారాయణ తెరకెక్కించిన ఆ ఒక్కటి అడక్కు తెలుగులో రంభ మొదటి సినిమా. తర్వాత తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు చేసింది.
స్టార్ హీరోలతో జతకట్టి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. అప్పట్లో హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న రంభ టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది. తెలుగులో బావగారు బాగున్నారా, బొంబాయి ప్రియుడు, అల్లుడా మజాకా, ముద్దుల ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, చిన్నల్లుడు వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
అంతేకాదు స్పెషల్ సాంగ్స్ లో కూడా రంభ మెరిసింది. హలో బ్రదర్, యమదొంగ, దేశముదురు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఆమె చివరిగా పెన్ సింగం సినిమాలో నటించింది. ఆ తర్వాత 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత రంభ పూర్తిగా సినిమాలకు దూరమైంది. వివాహం తర్వాత ఆమె భర్త, పిల్లలతో కెనడాలో సెటిల్ అయ్యారు. కాగా రంభకు ఇద్దరు కుమార్తెలు, ఒక బాబు ఉన్నాడు.
సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో రంభ యాక్టివ్ గా ఉంటారు. రంభ కూతురు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అచ్చం తన తల్లి లాగా చాలా అందంగా ఉంది. ప్రస్తుతం కూతురి వీడియో ఒకటి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సదరు వీడియోలో రంభ కూతురు చాలా చక్కగా మాట్లాడుతుంది. ఈ టీనేజ్ చిన్నారి మాట్లాడుతుంటే అచ్చం రంభ గుర్తుకు వస్తుంది. రంభ మాట్లాడినట్టే ఉంది.