
మిల్కీ బ్యూటీ తమన్నాకి పెళ్లి సెట్ అవడం లేదని ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటివరకూ తెగ ఫీల్ అయ్యారు. తమన్నాకి త్వరలోనే పెళ్లి చేయాలని ఎప్పటి నుండో సంబంధాలు కూడా చూస్తున్నారు మిల్కీ పేరెంట్స్. సినిమాలు చేసుకుంటూ పోతే, వయసు అయిపోతుందని.. లైఫ్ లో సెటిల్ అవ్వడం ఎంత ముఖ్యమో.. పెళ్లి అంతే ముఖ్యం అంటూ తమన్నాకి నచ్చ చెప్పి పెళ్లికి ఒప్పించారట.
అయితే పెళ్లి చేసుకోవాలని తమన్నా నిర్ణయించుకున్నప్పటికీ ఆమెకు తగిన వాడు, ఆమె అందానికి సరితూగే వాడు ఇన్నాళ్లు దొరకలేదట. ఒకపక్క తమన్నా మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు ఒప్పుకుంటుంది. అసలుకే అవకాశాలు తగ్గాయి. అందుకే వస్తున్న సినిమాలను అసలు రిజెక్ట్ చేయడం లేదు. పైగా అవకాశాల కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ప్రస్తుతం ఎఫ్ 2తో వచ్చిన మంచి సూపర్ హిట్ కారణంగా, అమ్మడికి ఎఫ్ 3 లో కూడా ఛాన్స్ వచ్చింది. వచ్చే నెల నుండి ఈ సినిమా షూట్ లో కూడా పాల్గొననుంది. అందుకే ఈ లోపే తమన్నా ఫ్యామిలీ ఆమె కోసం ఒక మంచి వరుడిని వెతికారు. మంచి భర్త కోసం వెయిట్ చేస్తున్న మిల్కీ బ్యూటీకి ఓ డాక్టర్ సంబంధం వచ్చిందని తెలుస్తోంది.
అన్ని సెట్ అయితే, త్వరలోనే తమన్నా డాక్టర్ కి సతీమణి అవుతుందట. ఏది ఏమైనా పెళ్లి తరువాత కూడా తమన్నా సినిమాలు చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటోంది. శ్రీయా లాంటి హీరోయిన్లు పెళ్లి తరువాత కూడా సినిమాలు చేస్తున్నారు. తానూ అలాగే చేస్తాను అంటూ తమన్నా మొత్తానికి తన ఫ్యామిలీ మెంబర్స్ కి క్లారిటీ కూడా ఇచ్చింది.