Prabhas Marriage:
Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. టాలీవుడ్ స్టార్స్ అందరూ వివాహం చేసుకున్నారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. నలభై ఏళ్ళు పైబడిన ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. ప్రభాస్ వివాహం పైఅనేక రూమర్స్ వినిపించాయి. ముఖ్యంగా హీరోయిన్ అనుష్క శెట్టిని ప్రభాస్ వివాహం చేసుకుంటాడనే ప్రచారం జరిగింది. బాహుబలి 2 విడుదల తర్వాత ఈ ప్రచారం మరింత జోరందుకుంది. అయితే ప్రభాస్, అనుష్క ఈ రూమర్స్ ఖండించారు. మేము స్నేహితులం మాత్రమే. మా పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న ప్రభాస్ ని బాలకృష్ణ పెళ్లి విషయం అడిగారు. ఎప్పుడు వివాహం చేసుకుంటావని అడగ్గా… ప్రభాస్ సిల్లీ సమాధానాలతో దాట వేశాడు. సల్మాన్ ఖాన్ వివాహం తర్వాతే నా పెళ్లి అన్నాడు ప్రభాస్. పిల్ల దొరకడం లేదని మరొక సమాధానం చెప్పాడు. ప్రభాస్ తీరు చూసిన అభిమానులు ఆయనకు పెళ్లి ఆలోచన లేదనే నిర్ణయానికి వచ్చారు.
తాజాగా కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేసిన కామెంట్స్ మరోసారి ప్రభాస్ పెళ్లి పై చర్చ జరిగేలా చేశాయి. ఆమె మాట్లాడుతూ.. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కి విజయం దక్కదని చాలా మంది అన్నారు. కానీ కల్కి మూవీతో హిట్ కొట్టి చూపించాడు. అలాగే ప్రభాస్ కి కూడా పెళ్లి జరుగుతుంది. దానికి సమయం రావాలి. అప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అని ఆమె అన్నారు. శ్యామలాదేవి కామెంట్స్ బట్టి ఆమెకు కూడా స్పష్టత లేదు.
మరోవైపు ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సాహో తర్వాత స్పీడ్ పెంచిన గత మూడేళ్ళలో నాలుగు సినిమాలు విడుదల చేశాడు. రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2829 AD చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రాజా సాబ్ సెట్స్ పై ఉంది. సలార్ 2 మూవీ షూటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయాల్సి ఉంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలుకానుంది. హను రాఘవపూడితో ఓ చిత్రానికి సైన్ చేశాడని వినికిడి. మరి ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనేది సస్పెన్సు..
Web Title: Syamaladevi made a sensational announcement about prabhas marriage
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com