Supritha: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. ఎక్కువగా తల్లి, వదిన, అక్క ఇలా పలు సపోర్టింగ్ రోల్స్ చేసి ఆకట్టుకుంది. మరోవైపు లేడీ కమెడియన్ గాను ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు పెద్దగా లేవు. సినిమాల సంగతి అటుంచితే నిత్యం సోషల్ మీడియాలో కూతురు సుప్రీతతో కలిసి తెగ సందడి చేస్తుంటుంది.
ఈ తల్లీకూతుళ్లు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు వైరల్ అవుతుంటాయి. ఇక సుప్రీత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, గ్లామర్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేసింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్స్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది. సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కాకుండానే ఓ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ కూడగట్టుకుంది.ఇక త్వరలో సుప్రీత వెండితెర పై మెరవనుంది.
బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ సరసన సుప్రీత హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం సుప్రీత సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆమె తాజాగా పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. సుప్రీత చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ లో పడేస్తున్నాయి. ఇంతకీ సుప్రీత ఏం పోస్ట్ చేసిందంటే .. తన లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ ఓ కామెంట్ జోడించింది.
నా జీవితంలోకి కొందరు వస్తుంటారు వెళుతుంటారు .. అదే లైఫ్ అంటే అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. ఆమె షేర్ చేసిన ఫోటోలు గ్లామరస్ గా ఉన్నాయి. ఈ ఫోటో కింద కామెంట్ సెక్షన్ బంద్ చేసింది. బహుశా సుప్రీత ఏదైనా ప్రేమ వ్యవహారం గురించి ఇలా ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతుందా? ఆమెకు ఎవరైనా బ్రేకప్ చెప్పారా అనే వాదనలు మొదలయ్యాయి. సుప్రీత – అమర్ దీప్ కి జంటగా ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తుంది. ఇది షూటింగ్ దశలో ఉంది.