https://oktelugu.com/

Allu Arjun: ఎన్నికల వేళ మామ పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ సంచలన పోస్ట్.. వైరల్

ఇప్పటికే పిఠాపురంలో మెగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ప్రచారం చేశారు. వారి ప్రచారానికి ఎనలేని క్రేజ్ వచ్చింది. మరోవైపు జబర్దస్త్ నటులు హైపర్ ఆది, గెటప్ శీనులు ముమ్మర ప్రచారం చేశారు. మధ్యలో సుడిగాలి సుధీర్ సైతం అలరించారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 9, 2024 / 06:38 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun: పవన్ కళ్యాణ్ కు రాజకీయ మద్దతు పెరుగుతోంది. అది సినీ పరిశ్రమ నుంచి. పలువురు సినీ సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిన్నటికి నిన్న నేచురల్ స్టార్ నాని, రాజ్ తరుణ్, తేజా సజ్జా, సంపూర్ణేష్ బాబు మద్దతు ప్రకటించారు. రాజకీయ ప్రయాణంలో అనుకున్న గమ్యం చేరాలని ఆకాంక్షించారు. చిరంజీవి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చిన తరువాతనే.. సినీ పరిశ్రమలో కదలిక వచ్చింది. చిరంజీవి విడుదల చేసిన వీడియోను జతపరుస్తూ రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

    ఇప్పటికే పిఠాపురంలో మెగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ప్రచారం చేశారు. వారి ప్రచారానికి ఎనలేని క్రేజ్ వచ్చింది. మరోవైపు జబర్దస్త్ నటులు హైపర్ ఆది, గెటప్ శీనులు ముమ్మర ప్రచారం చేశారు. మధ్యలో సుడిగాలి సుధీర్ సైతం అలరించారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, క్రికెటర్ అంబటి రాయుడు పిఠాపురం నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఈనెల 11న చిరంజీవి సైతం ప్రచారానికి రానున్నారని ఒక వార్త వైరల్ అవుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి.. ప్రముఖ నటులందరూ స్పందించి.. పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెప్పడం విశేషం. నేరుగా మద్దతు ప్రకటించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

    తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం స్పందించారు. పవన్ కు రాజకీయ మద్దతు ప్రకటించారు. ఆయన రాజకీయ ప్రయాణం అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. మీరు ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటుంది. మీ ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నా. అంటూ అల్లు అర్జున్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మెగా అభిమానులకు ఒక స్పష్టమైన సంకేతాలు పంపించినట్లు అయ్యింది.

    Tags