Sri Rama Navami: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి కొంత మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే శ్రీ రాముడిగా స్క్రీన్ మీద కనిపించి మెప్పించిన కొంతమంది హీరోలు ఉన్నారు. వాళ్ళెవరో ఒకసారి మనం తెలుసుకుందాం…
ముందుగా 1932 వ సంవత్సరంలో యడవల్లి సూర్య నారాయణ అనే హీరో ‘పాదుక పట్టాభిషేకం’ అనే సినిమాలో శ్రీరాముడిగా కనిపించాడు. ఇక మొదటిసారి స్క్రీన్ మీద శ్రీరాముడు వేషం వేసుకున్న హీరోగా కూడా ఈయన చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈయన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు 1944 వ సంవత్సరంలో ‘శ్రీ సీతారామ జననం’ అనే సినిమాలో శ్రీరాముడి గెటప్ లో నటించి మెప్పించాడు. ఇక 1959వ సంవత్సరంలో ఎన్టీయార్ “సంపూర్ణ రామాయణం” అనే సినిమా చేయడంతో స్క్రీన్ మీద రాముడు అంటే ఇలాగే ఉంటాడేమో అనేంతలా ప్రేక్షకుల్లో ఒక మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఆయన లవకుశ, శ్రీ రామాంజనేయ యుద్ధం లాంటి సినిమాల్లో రాముడిగా నటించి మెప్పించాడు.
ఇక ఇండియన్ సినిమా చరిత్రలోనే రాముడి పాత్ర చేయాలంటే అది ఎన్టీయార్ మాత్రమే అనేలా వైవిధ్యమైన నటనని కనబరిచి స్క్రీన్ మీద మాయ చేశాడనే చెప్పాలి. 1971 వ సంవత్సరంలో “సంపూర్ణ రామాయణం” సినిమాతో శోభన్ బాబు కూడా రాముడిగా నటించి మెప్పించాడు. అలాగే “బాల రామాయణం” సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలరాముడుగా నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
బాపు దర్శకత్వంలో వచ్చిన “శ్రీ రామరాజ్యం” సినిమాలో బాలయ్య బాబు కూడా రాముడి గా నటించి తనదైన రీతిలో వైవిధ్యాన్ని కనబరిచాడు. ఇక 2023 వ సంవత్సరంలో బాలీవుడ్ డైరెక్టర్ అయిన ఓం రావత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా “ఆది పురుష్” అనే సినిమా వచ్చింది. ఇక ఇందులో ప్రభాస్ రాముడి గా నటించి మెప్పించాడు… ఇలా మన తెలుగు హీరోలు రాముడిగా కనిపించి మెప్పించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి…