https://oktelugu.com/

Sreeleela: స్టార్ హీరో సినిమాతో తమిళ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల…

గత కొద్ది రోజుల క్రితం చెన్నైలోని ఒక కాలేజ్ నిర్వహించిన ఈవెంట్ కి హాజరైంది. ఇక అక్కడ ఆమెను చూసి అరుస్తున్న స్టూడెంట్స్ ను చూసిన శ్రీలీల మాట్లాడుతూ 'చెన్నైలో నన్ను ఎవరు గుర్తుపడతారు అని అనుకున్నాను.

Written By:
  • Gopi
  • , Updated On : April 25, 2024 / 12:58 PM IST

    Sreeleela

    Follow us on

    Sreeleela: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘పెళ్లి సందడి’ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయిన శ్రీలీల చాలా తక్కువ సమయం లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంది. ఇక ఆ సినిమా తర్వాత ‘ ధమాకా ‘ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న ఈ అమ్మడు స్టార్ హీరోలందరి సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి క్రేజ్ ను అయితే సంపాదించుకుంది. ఇక మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ సినిమాలో నటించడమే కాకుండా తన పాత్రకి తను న్యాయం చేసి తను స్టార్ హీరోయిన్ ఎందుకు అయిందో మరోసారి ప్రూవ్ చేసుకుంది.

    ఇక ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల క్రితం చెన్నైలోని ఒక కాలేజ్ నిర్వహించిన ఈవెంట్ కి హాజరైంది. ఇక అక్కడ ఆమెను చూసి అరుస్తున్న స్టూడెంట్స్ ను చూసిన శ్రీలీల మాట్లాడుతూ ‘చెన్నైలో నన్ను ఎవరు గుర్తుపడతారు అని అనుకున్నాను. కానీ మీ అరుపులు వింటుంటే చాలా ఆనందం గా ఉంది. ఇప్పటి నుంచి తమిళ్ సినిమాలను కూడా ఎక్కువగా చేయడానికి ఆసక్తి చూపిస్తాను’ అంటూ తను ఆ ఈవెంట్లో చెప్పింది. ఇక తను అనుకున్నట్టుగానే ఇప్పుడు ‘అధిక్ రవిచంద్రన్’ దర్శకత్వంలో అజిత్ హీరోగా వస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ ‘ అనే సినిమా లో ఒక కీలక పాత్రలో నటిస్తుందట.

    ఇక ఈ సినిమాను తెలుగులో టాప్ ప్రొడ్యూసర్స్ అయిన ‘మైత్రి మూవ్ మేకర్స్’ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే శ్రీలీల బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమాలో కూడా నటించబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తొందర్లోనే శ్రీలీల కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాతో కనక సక్సెస్ సాధిస్తే తమిళంలో తను స్టార్ హీరోయిన్ గా ముందుకు దూసుకెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…