https://oktelugu.com/

Mokshagna: మోక్షజ్ఞ సినిమాకి డైరెక్టర్ ఎవరైనా కానీ హీరోయిన్ మాత్రమే ఆమె….

నందమూరి నట సింహమైన బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక డైరెక్టర్ ఎవరు అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు కానీ, హీరోయిన్ ను మాత్రం ముందే ఫిక్స్ చేసి పెట్టినట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : July 5, 2024 / 08:49 AM IST

    Mokshagna

    Follow us on

    Mokshagna: ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అవుతున్నాడు అంటే ఆయన మీద భారీ అంచనాలు ఉంటాయి. అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ గాని, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గాని ఎలాంటి క్యారెక్టర్స్ చేశారు. వాళ్ళ లెగసి ని వీళ్లలో చూసుకోవాలనే ఉద్దేశ్యంతో అభిమానులు కొత్తగా ఎంట్రీ ఇస్తున్న వాళ్ళ మీద చాలా అంచనాలను పెట్టుకుంటారు. మరి ఆ అంచనాలను రిచ్ అయ్యే విధంగా సినిమా స్టోరీ ఉంటే పర్లేదు.

    కానీ లేకపోతే మాత్రం సినిమా ఫ్లాప్ అవ్వడం పక్క…ఇక ఇలాంటి క్రమంలోనే నందమూరి నట సింహమైన బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక డైరెక్టర్ ఎవరు అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు కానీ, హీరోయిన్ ను మాత్రం ముందే ఫిక్స్ చేసి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక మోక్షజ్ఞ ఏ డైరెక్టర్ తో సినిమా తీసిన కూడా అతని మొదటి సినిమాలో హీరోయిన్ గా మాత్రం శ్రీలీలా నే తీసుకోవాలని బాలయ్య బాబు పట్టు పట్టుకొని కూర్చున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకుముందు బాలయ్య బాబుతో శ్రీలీల ‘భాగవంత్ కేసరి’ సినిమాలో నటించింది. ఆ సినిమాలో బాలయ్య బాబు శ్రీలీలా కు గార్డియన్ గా ఉంటాడు.

    ఇక ఆమెకు కావాల్సినవన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. మరి ఇలాంటి క్రమంలోనే మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్ గా తను చేస్తే బాలయ్య భావించాడట. ఇక అందుకే ఆమెను మోక్షజ్ఞ సినిమాలో తీసుకోవాలని బాలయ్య అనుకుంటున్నారు . భగవంత్ కేసరి సినిమా సమయంలో బాలకృష్ణకి శ్రీలీలా కి మధ్య ఏర్పడిన మంచి సన్నిహిత్యం వల్లే బాలయ్య బాబు ఆమెను మోక్షజ్ఞ సినిమా కోసం రిఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక మొత్తానికైతే మోక్షజ్ఞ సినిమాకి డైరెక్టర్ ఫిక్స్ అవ్వక ముందే హీరోయిన్ అయితే సెలెక్ట్ అవ్వడం అనేది విశేషమనే చెప్పాలి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ తో సినిమా చేస్తాడా లేదా వేరే దర్శకుడితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…