Singer Mangli Accident: కారు ప్రమాదానికి గురైన సింగర్ మంగ్లీ… ఆసుపత్రికి తరలింపు! ప్రస్తుత కండీషన్ ఏంటంటే?

ఓ డీసీఎం వాహనం మంగ్లీ కారును వెనక నుండి ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో మంగ్లీతో పాటు మేఘ్ రాజ్, మనోహర్ అనే మిత్రులు ఉన్నారు.

Written By: S Reddy, Updated On : March 18, 2024 12:04 pm

Singer Mangli car accident

Follow us on

Singer Mangli Accident: స్టార్ సింగర్ మంగ్లీ ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుండి డీసీఎం వాహనం వేగంగా గుద్దింది. దాంతో మంగ్లీ కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. వివరాలు పరిశీలిస్తే… మంగ్లీ ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామ శాంతివనం లో జరిగిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరైంది. కార్యక్రమం ముగిశాక అర్ధరాత్రి కారులో హైదరాబాద్ కి బయలు దేరింది. బెంగుళూరు జాతీయ రహదారి మీదుగా ఆమె హైదరాబాద్ వైపు వస్తున్నారు. శంషాబాద్ మండలం తొండుపల్లి బ్రిడ్జి వద్ద మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది.

ఓ డీసీఎం వాహనం మంగ్లీ కారును వెనక నుండి ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో మంగ్లీతో పాటు మేఘ్ రాజ్, మనోహర్ అనే మిత్రులు ఉన్నారు. ఈ ముగ్గురికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. సమీపంలోని ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకుని ఇంటికి బయలు దేరారు. మంగ్లీ క్షేమంగా ఉన్నారని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇక మంగ్లీ కారును ఢీ కొట్టిన డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు . ప్రస్తుతం డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మంగ్లీ టాలీవుడ్ స్టార్ సింగర్ గా ఉన్నారు. అనేక సూపర్ హిట్ సాంగ్స్ ఆమె పాడారు. మంగ్లీ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే సింగర్స్ లో ఒకరు. తనదైన విలక్షణ గాత్రంతో ఆమె సంగీత ప్రియులను అలరిస్తున్నారు.

గత ఐదేళ్లుగా ఆమె హవా నడుస్తుంది. మరోవైపు బుల్లితెర కార్యక్రమాల్లో సందడి చేస్తున్నారు. స్టార్ మా లో ప్రసారం అయిన సూపర్ సింగర్ షోకి ఆమె జడ్జిగా వ్యవహరించారు. మంగ్లీతో పాటు శ్వేత, రాహుల్ సిప్లిగంజ్, అనంత్ శ్రీరామ్ జడ్జెస్ ఉన్నారు. సూపర్ సింగర్ ఇటీవల ముగిసింది. ముఖ్య అతిథిగా థమన్ వచ్చారు.