https://oktelugu.com/

Vijay Goat: విజయ్ చివరి చిత్రంలో ఒకప్పటి స్టార్ లేడీ… ఆసక్తి రేపుతున్న న్యూస్!

1997లో విడుదలైన ఎగిరే పావురమా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది లైలా. ఆ మూవీ హిట్ కొట్టడంతో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. వెంకటేష్-సౌందర్య జంటగా నటించిన పెళ్లి చేసుకుందాం మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 28, 2024 / 12:23 PM IST

    Vijay Goat

    Follow us on

    Vijay Goat: దళపతి విజయ్ నటనకు గుడ్ బై చెబుతున్న విషయం తెలిసిందే. ఆయన ప్రజా ప్రతినిధిగా మారి ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్నారు. ఇటీవల రాజకీయ పార్టీని ప్రకటించారు. తమిళగ వెట్రి కజగం విజయ్ స్థాపించిన పార్టీ పేరు. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనుంది. ఇప్పటికే ఆయన అభిమానులను, కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నాడు. ఇకపై సినిమాలు చేయనని విజయ్ ప్రకటించారు. చివరి చిత్రంగా గోట్ చేస్తున్నారు. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనేది పూర్తి టైటిల్.

    ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు. గోట్ చాలా వరకు షూటింగ్ జరుపుకున్నట్లు సమాచారం. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గోట్ చిత్రంలో పలువురు స్టార్ నటులు భాగం అవుతున్నారు. ప్రభుదేవా, ప్రశాంత్, ప్రేమ్ జీ, వైభవ్ నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో ఓ సీనియర్ హీరోయిన్ నటిస్తునట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు లైలా అట.

    1997లో విడుదలైన ఎగిరే పావురమా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది లైలా. ఆ మూవీ హిట్ కొట్టడంతో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. వెంకటేష్-సౌందర్య జంటగా నటించిన పెళ్లి చేసుకుందాం మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. బాలయ్యకు జంటగా పవిత్ర బంధం చిత్రం చేసింది. అప్పట్లో తెలుగు ఆడియన్స్ లో లైలాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. లైలా తెలుగులో నటించిన చివరి చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి.

    లైలా గోట్ మూవీలో నటిస్తున్నారన్న వార్త అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. ఈ క్రమంలో ఆమె ఓ పాత్రకు హీరోయిన్ గా నటించే అవకాశం కలదు. కాగా విజయ్ గత చిత్రం లియో భారీ విజయం అందుకుంది. మిక్స్డ్ టాక్ లో కూడా ఆరు వందల కోట్ల వసూల్ వరకు రాబట్టింది. మరి విజయ్ చివరి చిత్రం గోట్ ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.