Samantha: సినిమాల్లో ట్రెండ్ రోజురోజుకూ మారుతోంది. ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్ కంపల్సరీ అన్నట్టు అయిపోయింది. ఇకపోతే ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ కోసమే స్పెషల్ గా కొందరు ఉండేవారు. ఇలా చెప్పుకోవాల్సి వస్తే ముమైత్ ఖాన్, హంసా నందిని లాంటి బ్యూటీలు ఆడిపాడేవారు. అయితే రానురాను ఈ సాంప్రదాయం మారిపోయింది. స్పెసల్ గా ఐటమ్ సాంగ్స్ చేసేవాళ్లు పోయి ఏకంగా స్టార్ హీరోయన్లే ఆడిపాడుతున్నారు. దీంతో ఈ ఐటమ్ సాంగ్స్‌కు మరింత క్రేజ్ వస్తోంది. అయితే ఇప్పుడు సమంత కూడా ఇలాగే పుష్ప మూవీలో ఆడిపాడింది. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన సమంతకు ఇది లాభమా.. నష్టమా అనేది చూద్దాం.

మామూలుగా ఐటమ్ సాంగ్స్ చేయడం అంటే చాలామంది ఒకింత వెనకడుగు వేస్తారు. ఎందుకంటే స్టార్ హీరోయిన్ గా మంచి ఆఫర్లు వస్తున్న టైమ్ లో ఐటమ్ సాంగ్ చేయడమంటే కొంత సాహసమనే చెప్పాలి. ఫ్యాన్స్ వారిని ఐటమ్ సాంగ్స్ గర్ల్ గా చూస్తారనే భావన ఏర్పడుతుంది. హీరోయిన్ గా ఛాన్సులు రాకే ఇలా ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారని అనుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు సమంత విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఇప్పటి వరకు లేనంత హాట్ గా సమంత ఈ సాంగ్‌లో మెరిసింది.
కాగా ఈ పాటలో ఉన్న లిరిక్స్ మగాళ్లను మొత్తం వంకర బుద్ధి ఉన్న వాళ్లు అని చెప్పేలా ఉంది. కాబట్టి మగాళ్లు మొత్తం దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. పైగా విడాకుల తర్వాత మరీ ఇంత బోల్డ్ గా సమంత కనిపించేసరికి ఆమె మీద లేనిపోని రూమర్లు కూడా పుట్టుకొస్తున్నాయి. సమంతకు ఇప్పుడు ఫ్రీడమ్ దొరికిందని అందుకే ఇలా రెచ్చిపోతోందని అంటున్నారు. ఫ్యామిలీ మ్యాన్-2లో ఇలా నటింస్తేనే చివరకు విడాకుల దాకా సీన్ వెళ్లిందని, కానీ మళ్లీ ఇలాంటి పనే సమంత చేయడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు.
Also Read: Venkatesh: వెంకీ కెరీర్ లోనే భారీ రికార్డ్ క్రియేట్ చేసింది
ఓ పక్క విడాకులు తీసుకుని ఎక్కువ కాలం కూడా కాకుండానే ఇలా నటించడంపై సర్వత్రా చాలా రకాల విమర్శలే వస్తున్నాయి. సమంతలో ఉన్న బాధ, అసహనం కారణంగానే ఇలా నటిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయతే సమంత వల్ల పుష్ప మూవీకి కావాల్సినంత మేలు జరిగిందనే చెప్పొచ్చు. కానీ సమంతకు మాత్రం లేనిపోని రూమర్లు వస్తున్నాయి. మొత్తానికి ఈ ఐటమ్ సాంగ్ వల్ల సమంతకు సొంత ఇమేజ్ డ్యామేజ్ అవుతోందంటూ చెబుతున్నారు.
Also Read: HBD Rana: టాలీవుడ్ భల్లాల దేవ రానా పుట్టినరోజు నేడు.. ఆయన సినీకెరీర్పై ప్రత్యేక కథనం