Regina & Nivetha: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్లు రెజీనా, నివేదా థామస్ ముఖ్య పాత్రలో నటిస్తోన్న సినిమా శాకిని డాకిని. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. వీరి కాంబోలో గతంలో వచ్చిన ఓ బేబి సినిమా మంచి హిట్‌గా నిలిచింది. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి నవంబరు 2న నివేదా ధామస్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయగా.. రెజీనా పుట్టిన రోజుకు ఫస్ట్లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరూ మిలిటరీ యూనిఫామ్‌లో కనిపించడం మరింత ఆసక్తిని రేపింది. ఇందులో ఈ ఇద్దరు హీరోయిన్లు తమ కెరీర్లోనే తొలిసారి యాక్షన్ సీక్వెన్స్‌లు చేసినట్లు తెలుస్తోంది.
ఓబేబీ కత మిస్ గ్రామీ సినిమాకు రీమేక్ కావడంతో అది బ్లాక్బాస్టర్గా నిలిచింది. అయితే ఈ శాకిని డాకిని కథ చాలా భిన్నంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయిపోతుందని అన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చాలా కాలంగా ఒక్క మంచి హిట్ దొరక్క అల్లాడిపోతున్న రెజీనా ఈ సినిమాపైనే ఆశలన్ని పెట్టుకుంది. మరోవైపు తెలుగులో రాణించాలని. తిరిగి ఫామ్‌లోకి రావాలని నివేద ఆలోచిస్తోంది.