https://oktelugu.com/

Samantha: నిర్మాతగా మారిన సమంత… కిక్ ఇస్తున్న కొత్త సినిమా లుక్, మూవీ టైటిల్ ఇదే!

బృందావనం, దూకుడు చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. 14 ఏళ్ల కెరీర్లో సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. అత్యధిక హిట్ పర్సెంటేజ్ తో దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ అయ్యారు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 28, 2024 / 06:31 PM IST

    Samantha

    Follow us on

    Samantha: స్టార్ లేడీ సమంత జన్మదినం నేడు. ఈ సందర్భంగా కొత్త మూవీ ప్రకటించింది. టైటిల్ పోస్టర్ విడుదల చేసింది. సమంత లుక్ కిక్ ఇచ్చేదిగా ఉంది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం… సమంత నేడు పుట్టినరోజు జరుపుకుంటుంది. 1987 ఏప్రిల్ 28న జన్మించిన సమంత 37వ ఏట అడుగుపెట్టింది. ఎలాంటి నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత అంచెలంచెలుగా ఎదిగింది. 2010లో ఏమాయ చేసావే అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది.

    బృందావనం, దూకుడు చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. 14 ఏళ్ల కెరీర్లో సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. అత్యధిక హిట్ పర్సెంటేజ్ తో దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ అయ్యారు. సౌత్ లో సత్తా చాటిన సమంత హిందీలో కూడా ఫేమ్ రాబట్టింది. ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ మంచి విజయం సాధించింది. హనీ బన్నీ టైటిల్ తో మరో యాక్షన్ సిరీస్ చేస్తుంది. హాలీవుడ్ కి చెందిన సిటాడెల్ సిరీస్ కి ఇది ఇండియన్ వెర్షన్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

    గత ఏడాది సమంత నటించిన శాకుంతలం, ఖుషి చిత్రాలు విడుదలయ్యాయి. గ్యాప్ తీసుకున్న సమంత కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించలేదు. పుట్టినరోజు పురస్కరించుకుని తన కొత్త ప్రాజెక్ట్ వివరాలు పంచుకుంది. ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. చిత్ర టైటిల్ ”మా ఇంటి బంగారం”. ఫస్ట్ లుక్ సైతం షేర్ చేసింది. చీర కట్టులో గన్ పట్టుకొని వీరనారిగా సమంత లుక్ ఆసక్తి రేపుతోంది. చూస్తుంటే పీరియాడిక్ రివొల్యూషనరీ చిత్రం అనిపిస్తుంది.

    విశేషం ఏమిటంటే… ఈ చిత్రానికి సమంత నిర్మాత కూడాను. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించిన సమంత మొదటి చిత్రంగా మా ఇంటి బంగారం అనే చిత్రం చేస్తుంది. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నప్పటికీ, సమంత లుక్ మాత్రం రఫ్ అండ్ రెబల్ గా ఉంది. ప్రకటనతోనే సమంత తన కొత్త ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచేసింది. మా ఇంటి బంగారం చిత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.