
Rajamouli’s RRR: ‘ఆర్.ఆర్.ఆర్’ అంటే రాజమౌళి మాత్రమే గుర్తుకొస్తున్నాడు. ముఖ్యంగా మిగిలిన భాషల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ అంటే రాజమౌళి, అజయ్ దేవగన్ పేర్లు మాత్రమే బాగా వినిపిస్తున్నాయి. మరి ఎన్టీఆర్, చరణ్ మాటేమిటి ? ఆర్ఆర్ఆర్ నుంచి ఏ వీడియో వచ్చినా రాజమౌళి ఇరగదీసాడు అంటున్నారు. ఒక్క తెలుగులో తప్ప ఇక ఎక్కడా తారక్, చరణ్ లపై ఫోకస్ లేకుండా పోయింది.

హిందీలో అయితే, ఎన్టీఆర్ ను, చరణ్ ను అసలు హీరోలుగా గుర్తించడం లేదు. అజయ్ దేవగన్ హీరోలా కనిపిస్తున్నాడు. అలియా భట్ ప్రత్యేక ఆకర్షణ అయింది. చివరకు రాజమౌళి సినిమా అయింది. నిజంగా ఎన్టీఆర్, చరణ్ ల క్రేజ్ కి ఇది అవమానమే. ఆర్ఆర్ఆర్ పూర్తి క్రెడిట్ రాజమౌళి కే వెళ్ళింది. సోషల్ మీడియాలో కూడా రాజమౌళి సినిమాగా ప్రమోట్ అవుతుంది.

హీరోలకు తెలుగులో తప్ప ఇతర భాషల్లో అభిమానులు లేకపోవడం కూడా ఆర్ఆర్ఆర్ క్రెడిట్ హీరోలకు దక్కక పోవడానికి ఒక కారణం అయింది. నిజానికి రాజమౌళితో సినిమా అంటే ఇలాగే ఉంటుంది, అయితే, హీరోలకు కూడా మంచి గుర్తింపు దక్కేది. కాకపోతే.. రాజమౌళి ఎక్కువ హైలైట్ అయ్యేవారు. అయినా సినిమాలో హీరోకి మాత్రం స్టార్ వాల్యూ పెరుగుతూ వచ్చేది.
బాహుబలి నుంచి ఏ చిన్న పోస్టర్ వచ్చినా, ఏ చిన్న వీడియో వచ్చినా.. రాజమౌళితో పాటు ప్రభాస్ కి కూడా పేరు వచ్చేది. కానీ ఆర్ఆర్ఆర్ విషయంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. మూవీ లవర్స్ రాజమౌళి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అందుకే ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు రాజమౌళి పై కోపంగా ఉన్నారు.
స్టార్ హీరోలను భీభత్సంగా ఎలివేట్ చేయకుండా.. రాజమౌళి కావాలనే వారిని ప్రమోషన్స్ లో హైలైట్ చెయ్యట్లేదు అని ఫ్యాన్స్ జక్కన్న పై సీరియస్ గా ఉన్నారు. తెలుగులో అంటే.. హీరోలకు ప్రత్యేకంగా హైలైట్ చెయ్యర్లేదు. కానీ హిందీలో కచ్చితంగా హైలైట్ చేయాలి. పాన్ ఇండియా స్థాయిలో హీరోలకు మార్కెట్ రావాలి అంటే.. వాళ్ళు అక్కడ హైలైట్ అవ్వాలి. మరి జక్కన్న ఇప్పటినుంచైనా తారక్, చరణ్ లపై ఫోకస్ వెళ్లేలా ప్లాన్ చేస్తే హీరోలకు మంచి జరుగుతుంది.
Also Read: ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ పై హీరో రానా స్పందన.. కొత్త వివాదం