
నటీనటులు: సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్, జగపతిబాబు, రమ్యకృష్ణ తదితరులు.
దర్శకుడు: దేవ కట్ట,
నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, జీస్టూడియోస్,
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్,
సంగీత దర్శకుడు: మణిశర్మ,
ఎడిటర్: కె.ఎల్.ప్రవీణ్
మెగా హీరో సాయి తేజ్ హీరోగా దేవ కట్ట దర్శకత్వంలో వచ్చిన సినిమా రిపబ్లిక్. దేవా కట్ట సినిమాలు సహజంగానే కాస్త వైవిధ్యంగా ఉంటాయి. పెద్దగా కమర్షియల్ అంశాలు ఏమి ఉండవు. ఈ సినిమా కూడా అలాగే సాగింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.
కథ :
పంజా అభిరామ్ (సాయి ధరమ్ తేజ్) చిన్న తనం నుంచి తన తండ్రి (జగపతిబాబు) అవినీతి తనం పై ద్వేషం పెంచుకుంటూ ఉంటాడు. అలాగే ఈ సిస్టమ్ లోని లొసుగులు కూడా అభిరామ్ కి నచ్చవు. అందుకే అమెరికాకి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అభిరామ్ కలెక్టర్ కావాలనుకుంటాడు. ఈ లోపు విశాఖవాణి (రమ్యకృష్ణ) పార్టీ అధికారంలోకి వస్తోంది. అయితే, గత నలభై ఏళ్లుగా ఆమె ఓటు బ్యాంక్ కోసం తెల్లేరును విషపూరితంగా మారుస్తోంది. ఆ తెల్లేరు కోసం అభిరామ్ ఎలాంటి పోరాటం చేసాడు ? తెల్లేరు జాతకాన్ని ఎలా మార్చాడు.? చివరకు అభిరామ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
దర్శకుడు దేవ కట్ట రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లు సాగాయి. దానికి తోడు కీలకమైన ఎమోషన్స్ అన్నీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. తెల్లేరు నేపథ్యంలో వచ్చే సీన్స్ ఇంకా బలంగా ఉంటే బాగుండేది. నిజానికి సినిమాలో బలమైన కాన్ ఫ్లిక్ట్ ఉన్నా.. అది సరిగ్గా ఎలివేట్ కాకపోవడం కూడా.. సినిమాకి పెద్ద మైనస్ అయింది.
కాకపోతే సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. డైలాగ్స్ బాగున్నాయి. దర్శకుడు దేవ కట్ట స్క్రీన్ ప్లే పరంగా కూడా సినిమాని బాగానే మలిచే ప్రయత్నం చేసినప్పటికీ, మిగిలిన విభాగాల నుండి సరైన సపోర్ట్ లేకపోవడం వల్లే మొత్తానికి అవి సరిగ్గా ఎలివేట్ అవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తోంది. కానీ పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోవు.
ఇక సినిమాటోగ్రఫీ బాగున్నా సినిమాలోని చాలా సన్నివేశాలను ఇంకా బెటర్ గా చూపించొచ్చు. ఎడిటింగ్ బాగుంది కానీ, సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాణ విలువులు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
పొలిటికల్ మెసేజ్,
డైలాగ్స్,
సాయి తేజ్ నటన,
కొన్ని ఎమోషనల్ సీన్స్,
మైనస్ పాయింట్స్ :
ఓవర్ సీరియస్ నెస్ మోడ్,
స్లో నెరేషన్,
బోరింగ్ ప్లే,
ఇంట్రెస్ట్ లేని సీన్స్,
ఫస్ట్ హాఫ్.
సినిమా చూడాలా? వద్దా ?
‘రిపబ్లిక్’ అంటూ వచ్చిన ఈ సీరియస్ పొలిటికల్ ఎమోషనల్ డ్రామా.. ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. సినిమా నిండా ఎమోషన్ ఉన్నా .. ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యే విధంగా ఆ ఎమోషన్ ఎలివేట్ కాలేదు. అయితే కొన్ని ప్రాక్టికల్ సీన్స్, నేటి రాజకీయ పరిస్థితుల గురించి ప్రస్తావించిన అంశాలు బాగున్నాయి. పొలిటికల్ డ్రామాలు ఇష్టపడే వారు ఈ సినిమాని చూడొచ్చు.
oktelugu.com రేటింగ్ 2.75