Tamannaah: ‘మిల్క్ బ్యూటీ’ తమన్నా వివాహం పై వచ్చినన్ని రూమర్లు మరో హీరోయిన్ పై రాలేదు. గత పది సంవత్సరాలుగా తమన్నా పెళ్లి పై రూమర్లు వస్తూనే ఉన్నాయి. సహజంగా ‘కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు, కానీ స్టార్ హీరోయిన్ తమన్నాకు మాత్రం ఆ కళ్యాణ ఘడియలు ఎందుకు రావడం లేదో ? అసలు తమన్నా ఎందుకు పెళ్ళికి దూరంగా ఉంది ? ఇలా చాలా డౌట్లు ఉన్నాయి ఆమె అభిమానుల్లో.

ఐతే, తమన్నా – ఓ బిజినెస్ మెన్ కి మధ్య నిజంగానే ప్రేమ కథ నడుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో సోషల్ మీడియాలో తమన్నా పెళ్లి పై చాలా కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి తమన్నా పెళ్లికి ఉన్న డిమాండ్ ను గ్రహించిన ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ జగన్నాథ్ గురూజీ.. తమన్నా వివాహంపై కామెంట్స్ చేసి మొత్తమ్మీద నెట్టింట వైరల్ అయ్యాడు.
Also Read: KGF 2: లాభాల్లో ‘రాఖీ భాయ్’.. డబ్ చిత్రాల్లో సరికొత్త రికార్డు !
తమన్నాకి వృత్తి పై అంకితభావం ఎక్కువ అని, తమన్నా ముఖ కవళికలను బట్టి చూస్తే.. ఆమె ఇండస్ట్రీ వ్యక్తిని కాకుండా, సినిమాలకు సంబంధం లేని బయటి వ్యక్తిని తమన్నా పెళ్లాడనుందని కామెంట్స్ చేశాడు. ఇక హిరోయిన్ గా తమన్నాకు ఎలాగూ ఛాన్స్ లు బాగా తగ్గాయి.

మరోపక్క యంగ్ బ్యూటీస్ రష్మిక, పూజా హెగ్డే, కీర్తి సురేష్, కృతి శెట్టి, కేతిక శర్మ లాంటి కొత్త భామలు వరుస అవకాశాలతో రెచ్చిపోతున్న క్రమంలో తమన్నాకి సైడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. పైగా తమన్నాతో పాటు హీరోయిన్ గా వచ్చిన శ్రీయా, కాజల్ లాంటి హీరోయిన్లు ఆల్ రెడీ పెళ్లి చేసుకుని.. పిల్లల కూడా కన్నారు.
కానీ, తమన్నా మాత్రం ఇంకా మేకప్ పూసుకుంటూ.. తనకు సినిమాలే సరదా అంటూ కాలక్షేపం చేస్తోంది. నిజానికి గత మూడేళ్ళ నుంచే తమన్నా .. మంచి సంబంధం కోసం చూస్తోందట. కానీ సెట్ కావడం లేదు.
Also Read:Telugu Indian Idol: ఇండియన్ ఐడల్: ఒక్కో మెట్టు ఎక్కి ఫైనల్ చేరిన సిరిసిల్ల పేద కుర్రాడి కథ!
Recommended Videos:
[…] […]
[…] […]
[…] Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సుమారు రెండేళ్ల నుండి తమ అభిమాన హీరో ని వెండితెర మీద చూడడం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆయన హీరో గా నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా 2020 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచి మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాస్సర్ గా నిలిచింది..ఈ సినిమా తర్వాత కోవిద్ రావడం తో మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట షూటింగ్ వాయిదా పడుతూ ఆలస్యం అయ్యింది..ఇప్పుడు పరిస్థితులు అన్ని చక్కబడడం తో ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు మే 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది..ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా పాటలు మరియు టీజర్ అభిమానులను ఉర్రూతలు ఊగించింది అనే చెప్పాలి. […]