Homeఎంటర్టైన్మెంట్Rowdy Boys: ఆ హీరో సినిమాను టార్గెట్ చేసిన ‘రౌడీ బాయ్స్’..!

Rowdy Boys: ఆ హీరో సినిమాను టార్గెట్ చేసిన ‘రౌడీ బాయ్స్’..!

Rowdy Boys Movie: దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు అశిష్ హీరోగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. శ్రీహర్ష కొనుగంటి డైరెక్షన్లో రాబోతున్న ‘రౌడీ బాయ్స్’తో అశిష్ తెలుగు ప్రేక్షకులను పలుకరించనున్నాడు.  ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర బ్యానర్లో దిల్ రాజు, శిరీష్ లు సంయుక్తంగా నిర్మిస్తుండగా దేవీశ్రీ ప్రసాద్ బాణీలను అందించాడు.

Rowdy Boys Motion Poster

‘రౌడీ బాయ్స్’ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె చుట్టూనే సినిమా కథ మొత్తంగా తిరుగనుంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ పుల్ అండ్ రోమాంటిక్ గా ‘రౌడీ బాయ్స్’ ఉండనుందని ఇటీవల రిలీజైన ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. జనవరి 14న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

‘రౌడీ బాయ్స్’ రిలీజుకు ముందే ఉత్తరాంధ్రలో గడబిడ సృష్టిస్తోంది. దిల్ రాజుకుక ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. తమకు నచ్చిన సినిమాలను ఆ థియేటర్లలో ఆడిస్తుంటారు.  విశాఖలో కీలకమైన మెలోడీలో ప్రస్తుతం నాని ‘శ్యామ్ సింగ రాయ్’ నడుస్తోంది. ఈ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజు వరకేనని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందులో‘రౌడీ బాయ్స్’ సినిమాను వేయాలని కోరితే ‘బంగార్రాజు’కు ఒకే చెప్పారట. దీంతో ‘శ్యామ్ సింగరాయ్’ మూవీనే కంటిన్యూ చేయమని దిల్ రాజు చెప్పారట.

నిజానికి ‘శ్యామ్ సింగరాయ్’కి ప్రస్తుతం పెద్దగా కలెక్షన్లు లేవని తెలుస్తోంది. అయినప్పటికీ ఆ సినిమాను కంటిన్యూ చేయమని కోరారట. అలాగే జగదాంబలో ‘పుష్ప’ కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా ‘రౌడీ బాయ్స్’నే వేయమని ఒత్తిడి తేగా మెలోడికి ఒక రూల్, తమకో రూలా? అంటూ డిస్ట్రిబ్యూటర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట. అనకాపల్లిలోనూ ‘పుష్ప’ తప్పించి రౌడీ బాయ్స్ వేయమని ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.

అలాగే నైజాంలోని బీ, సీ సెంటర్లలోనూ దిల్ రాజు కోసం ‘రౌడీ బాయ్స్’ వేయాల్సి వస్తోందని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారట. ఈ పండుగకు బంగార్రాజు వేస్తామన్నా కూడా ‘రౌడీ బాయ్స్’కే థియేటర్స్ కావాలని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రాలో ‘పుష్ప’కు, నైజాంలో ‘బంగార్రాజు’కు రౌడీ బాయ్స్’ ఒకేసారి చెక్ పెడుతోంది. రాజుగారి మాట వినకపోతే తర్వాత తమకు కోరిన సినిమా ఇవ్వరనే భయంతో డిస్ట్రిబ్యూటర్లు తప్పని పరిస్థితుల్లో ‘రౌడీ బాయ్స్’నే ప్రదర్శించేందుకు సిద్దమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular