Rana 1947 Movie: రానా, రెజీనా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘1945’. సత్య శివ దర్శకత్వంలో ’కె.ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎస్.ఎన్.రాజ రాజన్, సి.కళ్యాణ్ నిర్మాణంలో రూపొందింది ఈ చిత్రం. ఈ సినిమా షూటింగ్ నాలుగేళ్ళ క్రితం స్టార్ట్ అయింది. అనేక కారణాల వల్ల షూటింగ్ ఆగిపోతూ చివరకు అన్నీ అడ్డంకుల్ని దాటుకుని జనవరి 7న రిలీజ్ అయి భారీ డిజాస్టర్ అనిపించుకుంది. మరి ఓసారి ఈ సినిమా కలెక్షన్లను చూద్దాం.

నైజాం 0.13 కోట్లు
సీడెడ్ 0.06 కోట్లు
ఆంధ్రా : 0.11 కోట్లు
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 0.30 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.07 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 0.37 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.
కాగా ఈ చిత్రంలో నాజర్, సత్యరాజ్, సప్తగిరి వంటి స్టార్ క్యాస్టింగ్ ఉన్నా డిజాస్టర్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాదు. ఇక సినిమా విషయానికి వస్తే.. 1945లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపిస్తాడు. ఆ సమయంలో తన కుటుంబ వ్యాపారాలను చూసుకునేందుకు ఈ సినిమాలో హీరో బర్మాకు వెళ్తాడు. అక్కడ బ్రిటిష్ పాలకులపై హీరో పోరాటం చేశాడు అనేది కథ.
Also Read: Mahesh Babu: మహేష్ నుంచే థమన్ కి కరోనా.. ఆందోళనలో కీర్తి సురేష్, పరుశురామ్ !
‘1945’ చిత్రానికి మొదట వేరే నిర్మాత. రానా సినిమా నుంచి వెళ్ళిపోయాక.. నిర్మాత చేతులు ఎత్తేశాడు. అప్పుడు సి.కళ్యాణ్ వెళ్లి అతి తక్కువ ధరకు సినిమాను కొనుక్కుని మొత్తానికి రిలీజ్ చేశాడు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.25 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ రాబట్టడం చాలా కష్టం. రానా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రం ఇది.
Also Read: Bangarraju: ‘బంగార్రాజు’.. కొత్తగా నాకేమయ్యిందో పాట ఇదే !