RGV: సినిమాలో సినిమాటోగ్రాఫర్ గొప్పతనం ఏమి ఉండదు అంటున్న ఆర్జీవీ..కారణం ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక స్థాయిని అయితే ఏర్పాటు చేశాయి. ఇక ఇలాంటి క్రమంలో మనలో చాలామంది సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుతూ ఉంటారు.

Written By: Gopi, Updated On : March 21, 2024 3:19 pm

RGV sensational comments on Cinematographer

Follow us on

RGV: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునే క్రమంలో వాళ్లకు నచ్చిన సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో అందరిని అలరిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు శివ సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక స్థాయిని అయితే ఏర్పాటు చేశాయి. ఇక ఇలాంటి క్రమంలో మనలో చాలామంది సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఒక సినిమా బాగా రావడానికి సినిమాటోగ్రాఫర్ గొప్పతనం ఏమి ఉండదు అని ఒక ఇంటర్వ్యూలో వర్మ చెప్పడం విశేషం…

వర్మ మాట్లాడుతూ శివ సినిమాకి గోపాల్ రెడ్డి అనే ఒక పెద్ద సినిమాటోగ్రాఫర్ ని తీసుకున్నాను. అయితే ఆయన అంతకుముందే చాలా సినిమాలకు సినిమాటోగ్రఫీ చేసి ఉన్నాడు. అయినప్పటికి శివ సినిమాలో మాత్రమే ఆయన పెట్టిన షాట్స్ గాని, ఆయన వాడిన లైటింగ్ గాని చాలా అద్భుతంగా ఉంది అని ప్రశంసలు అయితే దక్కాయి. మరి అన్ని సినిమాలు చేసినప్పుడు ఆయనకు రాని గుర్తింపు ఒక శివ సినిమాకే రావడం ఏంటి అని వర్మ చెబుతూ ఒక దర్శకుడి గా నేను ఏ షాట్ అయితే పెట్టమని చెప్పానో తను అదే షాట్ పెట్టాడు. నేను ఎలాంటి లైటింగ్ కావాలని చెప్పానో ఆయన అలాంటి లైటింగ్ అనేది సెట్ చేశాడు. నేను చెప్పినట్టు చేశాడు కాబట్టే ఆ సినిమా అనేది అంత బాగా వచ్చింది.

సినిమాటోగ్రఫీ చేసినందుకు ఆయనకు కూడా చాలా మంచి పేరు అయితే వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఎంటి అంటే దర్శకుడుకి అన్ని విషయాల్లో క్లారిటీ ఉంటే సినిమాటోగ్రఫీ అనేది ఎలివేట్ అవుతుంది. అంతే తప్ప సినిమాటోగ్రాఫర్ కొత్తగా చేసేది ఏమీ ఉండదు అని చెప్పాడు. నిజానికి శివ కి ముందు గోపాల్ రెడ్డి చేసిన సినిమాలు అన్నీ ఒకేత్తు అయితే శివ సినిమా నుంచి ఆయన పొందిన గుర్తింపు అనేది మరో లెవల్లోకి వెళ్లిపోయింది. ఇక దీన్నిబట్టి దమ్ముంటే ఏదైనా సాధించొచ్చు అని తెలుస్తుంది…