
‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ మాజీ సతీమణి రేణూ దేశాయ్ కు చేదు అనుభవాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఆమె చురుకుగా ఉండటమే, ఆమె అవమానాలకు కారణమని నెటిజన్లే కామెంట్స్ పెట్టేస్తున్నారు. అయినా కరోనా బాధితులకు అండగా నిలవడం రేణు దేశాయ్ తప్పేలా అవుతుంది. అసలు కొంతమంది ఆమెను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ కామెంట్స్ నే భరించలేక బాధ పడుతున్న రేణు దేశాయ్ కి ఇప్పుడు కొత్త షాక్ తగిలింది. కానీ, ఆమెకు ఈ షాక్ నష్టం కష్టం కలిగించకపోయినా ఆమె పోస్ట్ చేసిన మెసేజ్ మాత్రం అందరికీ షాక్ కి గురి చేసింది. రేణూ బ్యాంకింగ్ వ్యవహారాల పై ఒక షాకింగ్ పోస్ట్ ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. పైగా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా ఆమె షేర్ చేశారు.
రేణు దేశాయ్ ఇండస్‌ఇండ్ బ్యాంక్ మొబైల్ యాప్‌లోకి లాగిన్ అయ్యారు. అయితే ఆమె వేరొకరి ఖాతాలోకి లాగిన్ అయ్యారు. పైగా సదరు ఖాతాలోని పూర్తి వివరాలను కూడా ఆమె చూడగలిగారు. అంటే, రేపు తన ఖాతా పరిస్థితి కూడా ఇంతే కదా అని ఆమె షాక్ అయ్యాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది. ఆమె హెల్ప్ లైన్ నంబర్ కు కూడా ఫోన్ చేసి విషయం చెప్పారు.
కానీ బ్యాంక్ వారు మాత్రం ఆమె ఫిర్యాదును సీరియస్ గా తీసుకోలేదట. మొత్తానికి ఆ బ్యాంక్ సంస్థ, తన కస్టమర్లకు ఇస్తున్న భద్రతను చూస్తుంటే.. మిగిలిన ఆ బ్యాంకు ఖాతాదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేణు దేశాయ్ అయితే, ఆ బ్యాంకులో తన అకౌంట్ ను సోమవారం క్లోజ్ చేయబోతున్నట్టు కూడా ఆమె వెల్లడిస్తూ ఒక మెసేజ్ పెట్టారు. ఏది ఏమైనా బ్యాంకింగ్ లావాదేవీల పై భద్రతా లోపాలు వస్తే ఖాతాదారులు ఎవరికీ బ్యాంక్ పైనే నమ్మకాన్ని కోల్పోతారు.