https://oktelugu.com/

జగన్ ఢిల్లీ పర్యటన ఆంతర్యమేమి?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు.ఈసారి ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది.సీఎం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే అపాయింట్ మెంట్ తసుకున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం ఢిల్లీ పర్యటనలో సాయంత్రం సీఎం జగన్ అమిత్ షాతో భేటీ అవుతారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో కేంద్రం నుంచి వ్యాక్సిన్ల పంపిణీకి ప్రాధాన్యం ఇవ్వాలని […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 5, 2021 / 04:59 PM IST
    Follow us on

    ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు.ఈసారి ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది.సీఎం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే అపాయింట్ మెంట్ తసుకున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం ఢిల్లీ పర్యటనలో సాయంత్రం సీఎం జగన్ అమిత్ షాతో భేటీ అవుతారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించనున్నారు.
    ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో కేంద్రం నుంచి వ్యాక్సిన్ల పంపిణీకి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానికి లేఖలు రాసిన నేపథ్యంలో జగన్ అమిత్ షా భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇతర రాష్ర్టాల కంటే తక్కువ మొత్తంలో వ్యాక్సిన్లు ఏపీకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో తాజాగా ముఖ్యమంత్రి అన్ని రాష్ర్టాల సీఎంలకు లేఖలు రాశారు.

    వ్యాక్సిన్ల విషయంలో ముఖ్యమంత్రులంతా ఒకే వాయిస్ తో ఉండాలని సీఎం కోరారు. దీనిపై రాజకీయంగా పెద్దఎత్తున చర్చ సాగుతోంది.ఈ అంశంపై అమిత్ షా భేటీలో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. ఏపి  ప్రభుత్వంపై తన సొంత పార్టీకి చెందిన ఎంపీ రెబల్ గా మారి చేస్తున్న ప్రచారంపై సీఎం కేంద్ర హోం మంత్రితో చర్చించనున్నట్లు సమాచారం. రఘురామరాజు పై తాము ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు అనర్హత వేటు వేయకపోవడంపై జగన్ అండ్ టీం గుర్రుగా ఉంది.

    రఘురామ రాజుకు బీజేపీలో కొందరు ముఖ్యమంత్రుల మద్దతు ఉంది. దీంతో రఘురామ రాజుపై చర్యలు తీసుకోవాల్సిందేనని వైసీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఏపీలో కేసుల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని వ్యాక్సిన్లు కేటాయించేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి మరోసారి అమిత్ షాను కోరనున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి కాావాల్సిన నిధులపైన వరుసగా కొర్రీలు పెడుతున్నారు. నిధుల విషయంలో జోక్యం చేసుకుని రాష్ర్ట విభజన అంశాలపైన నోడల్ శాఖగా ఉన్న హోంశాఖ తగిన సూచనలు చేయాలని సీఎం కోరనున్నారు.