
కరోనా మహమ్మారి సోకి ఇటీవల కోలుకున్న అల్లు అర్జున్ ఒక నెల హైదరాబాద్‌కు దూరంగా తన కుటుంబంతో సుదీర్ఘ విహారయాత్రకు వెళ్లాలని యోచిస్తున్నాడు. కరోనా కేసులు లేని ఏకాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్లడం కోసం చూస్తున్నాడట..
తెలుగు చిత్ర పరిశ్రమ సినీ కార్మికులు, నటీనటులు.. సాంకేతిక నిపుణుల కోసం జూన్ మరియు జూలైలలో భారీ టీకా డ్రైవ్‌ను అమలు చేయడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ యోచిస్తోంది. ఆ తర్వాత ఆగస్టులో షూటింగులను ప్రారంభించేలా ప్రణాళికను రూపొందించింది.
అల్లు అర్జున్ కూడా “పుష్ప” షూటింగ్‌ను రెండు నెలల్లో తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు. దీనికి ముందు అతను కుటుంబంతో గడపాలని చుస్తున్నారు. “పుష్ప” చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈలోగా దర్శకుడు సుకుమార్ “పుష్ప” మొదటి భాగం కోసం చేయాల్సిన మార్పులను ఖరారు చేస్తారు. మొదటిభాగం ఈ సంవత్సరంలో విడుదల కానుంది.
మొదటి భాగం చిత్రీకరించాల్సిన సన్నివేశాలను పూర్తి చేయడానికి సుకుమార్ సుదీర్ఘ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కోసం బన్నీ ఎంతో అవసరం. అందువల్ల అతను దాని కోసం తన శక్తిని పెంచుకోవాల్సివుంటుంది. ఈ క్రమంలోనే ఈ నెల విహారయాత్రకు ఫ్యామిలీతో వెళ్లాలని ఆలోచిస్తున్నాడట..