Bigg Boss 6 Telugu Marina Remuneration: గత కొద్ది వారాల నుండి ఊహించని ఎలి్మేషన్స్ తో ఇంటి సభ్యులకు మరియు ప్రేక్షకులకు షాక్ మీద షాక్ లు ఇస్తూ వచ్చిన బిగ్ బాస్ ఈసారి మాత్రం అందరూ ఊహించినట్టుగానే మరీనా ని ఎలిమినేట్ చేసాడు.. బిగ్ బాస్ కి వచ్చిన ప్రారంభం లో కేవలం వంటింటికి మాత్రమే పరిమితమైన మరీనా టాస్కుల విషయం లో మిగిలిన ఇంటి సభ్యులతో పోలిస్తే కాస్త తక్కువగానే ఆడింది.. కానీ గత కొద్ది వారాల నుండి ఆమె తాస్కులు బాగా ఆడుతూ వస్తుంది.. ఆమె ఎదుటి వ్యక్తులతో నడుచుకునే నడవడిక కూడా ప్రేక్షకులకు బాగా నచ్చడం వల్లే ఇన్ని రోజులు ఆమె ఇంట్లో కొనసాగింది.

హౌస్ నుండి జీరో నెగటివిటీ తో బయటకి వచ్చిన బాలదిత్య మరియు వాసంతిలతో పాటుగా మరీనా కూడా ఒకరు..హౌస్ లో అందరి బాగోగులు చూసుకునే మరీనా ఎలిమినేట్ అయితే హౌస్ లో ఆమె భర్త రోహిత్ మినహా ఒక్కరు కూడా బాధపడకపోవడం గమనార్హం.. శ్రీహన్ అయితే అసలు పట్టించుకోలేదు..గత వారం లో ఆమెతో జరిగిన ఒక చిన్న గొడవ వల్లే శ్రీహన్ అలా ప్రవర్తించి ఉంటాడని సోషల్ మీడియా లో అందరు అనుకుంటూ ఉన్నారు.
Also Read: Kantha Rao Family: కాంతారావు కుటుంబం కష్టాలకి సమాజం ఎలా బాధ్యత తీసుకుంటుంది?
ఇక 11 వారాలకు గాను మరీనా అందుకున్న పారితోషికం ఇంతే అంటూ సోషల్ మీడియా లో ఒక ప్రచారం సాగుతుంది..బిగ్ బాస్ హౌస్ లోకి జంటగా వచ్చిన మరీనా – రోహిత్ లను బిగ్ బాస్ ఒకే కంటెస్టెంట్ గా పరిగినించారు..రెమ్యూనరేషన్ కూడా ఇద్దరికీ కలిపే లెక్కగట్టారట..కొన్ని వారాల తర్వాత వీళ్లిద్దరినీ విడదీయడం తో ఎవరి ఆట వారిదే అయ్యింది కాబట్టి రెమ్యూనరేషన్ కూడా ఇద్దరికీ సెపెరేట్ చేశారట.

అలా 11 వారాలకు గాను మరీనా కి 3 లక్షల 8 వేల రూపాయిలు పారితోషికంగా అందిందట.. అంటే వారానికి ఎవరేజి గా 35 వేల రూపాయిలు అన్నమాట.. మరీనా ఒక పాపులర్ టీవీ సీరియల్ ఆర్టిస్ట్.. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంది అంటే కచ్చితంగా ప్రేక్షకులు ఎక్కువ పారితోషికం ఉంటుందనే ఊహించారు.. కానీ ఆమె రేంజ్ కి 3 లక్షల 8 వేలు అంటే చాలా తక్కువ అనే చెప్పాలి.. గత వారాల్లో ఎలిమినేట్ అయిన గీతు మరియు బాలదిత్య వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కి వచ్చిన రెమ్యూనరేషన్స్ కూడా అంతంత మాత్రమే.. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ ఇచ్చే కాష్ ప్రైజ్ కి కూడా భారీగా చిల్లు పడుతుంది.. కాష్ ప్రైజ్ ని గత వారం లో ఆటలో పెట్టిన బిగ్ బాస్ కోత విధిస్తూ వచ్చారు.. అలా 50 లక్షల కాష్ ప్రైజ్ కాస్త 38 లక్షలకు పడిపోయింది.. రాబోయ్యే రోజుల్లో ఇది మరింత తగ్గిపోయింది 10 లక్షలకు పడిపోయ్యే అవకాశం కూడా ఉందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది.. ఇదంతా గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ TRP రేటింగ్స్ దారుణంగా పడిపోయి బిగ్ బాస్ నిర్వాహకులకు భారీ నష్టాలు రావడమే కారణం అని తెలుస్తుంది.
[…] Also Read: Bigg Boss 6 Telugu Marina Remuneration: 11 వారాలకు గాను మెరీనా క… […]