Naa Anveshana
Naa Anveshana: నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఏకంగా వంద ఐఫోన్ లు ఫాలోవర్స్ కి పంచుతానని వీడియో వదిలాడు. దీంతో లక్షల్లో కామెంట్లు వచ్చి పడ్డాయి. అది కూడా ఐ ఫోన్ 15 ప్రో అనేసరికి జనం తెగ ఎగబడ్డారు. ఫ్రీగా వస్తుందంటే ఎవరు వద్దంటారు. ఈ ఆఫర్ సామాన్యులనే కాదు సెలబ్రిటీలను సైతం ఎట్రాక్ట్ చేసింది. అందులో బిగ్ బాస్ సీజన్ 7 రతిక కూడా ఉండటం విశేషం. ఐ ఫోన్ అనేసరికి అమ్మడు తెగ ఎగ్జైట్ అయిపోయింది.
నా అన్వేషణ అంటూ ప్రపంచ దేశాలన్నీ చుట్టి వస్తున్న యూట్యూబర్ అన్వేష్ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దాదాపు 20 లక్షల మంది నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అతను దేశంలోనే నంబర్ వన్ యూట్యూబర్స్ లో ఒకడు. అంతే కాదు సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇప్పటికే 167 దేశాలు చుట్టొచ్చాడు. ఇంస్టాగ్రామ్ లో అతనికి 1. 4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
తాజాగా నా అన్వేషణ అవినాష్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ మైండ్ బ్లాక్ చేసే ఆఫర్ ప్రకటించాడు. వంద ఐ ఫోన్ లు తన ఫాలోవర్స్ కి పంచుతానని వీడియో చేశాడు. ఈ సందర్భంగా .. వంద ఐ ఫోన్ లు మీకు ఇవ్వబోతున్నాను .. రండి బాబు .. రండి .. చవక చవక. నేను ఐ ఫోన్ కంపెనీ కి ప్రమోట్ చేయడం లేదు కానీ .. జస్ట్ వాళ్ళు నా ఫోటోతో పాటు చవక చవక అనే డైలాగ్ ని వాడుకుంటున్నారు. అందుకు నాకు 100 ఐ ఫోన్ లు ఇస్తానన్నారు.
ఎలాగో నేను కొని ఇవ్వలేను. కాబట్టి మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లాటరీ ద్వారా వంద ఐ ఫోన్ లు అందిస్తాను అని చెప్పాడు. వచ్చే ఇదే టైం కి మీ పేర్లను ఎనౌన్స్ చేస్తానని చెప్పుకొచ్చాడు నా అన్వేషణ అవినాష్. ఇక అలా వీడియో పెట్టాడో లేదో .. కామెంట్ల లక్షల్లో వచ్చాయి. వీళ్ళలో బిగ్ బాస్ రతిక కూడా ఉంది. ఐ ఫోన్ 15 అనేసరికి టెంప్ట్ అయిన బ్యూటీ నా అన్వేషణ యూట్యూబర్ కి కామెంట్ పెట్టింది.లవ్ సింబల్స్ తో కూడిన ఎమోజీలు కామెంట్ గా పోస్ట్ చేసింది. పాపం రతిక కి కూడా ఫ్రీగా వచ్చే ఐ ఫోన్ కోరుకుంటుందని కొందరు వాపోతున్నారు.
Web Title: Rathika rose comment on naa anveshana youtube channel
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com