Supreetha
Supreetha: సురేఖ వాణి కూతురు సుప్రీత లేటెస్ట్ సెన్సేషన్. సోషల్ మీడియాలో సుప్రీత సందడి మామూలుగా ఉండదు. అమ్మడు అందాల ఆరబోతలో కొంచెం కూడా మొహమాట పడదు. సుప్రీత, సురేఖ వాణి కలిసి రీల్స్, డాన్స్ వీడియోలతో రచ్చ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ సుప్రీత తన ఫ్యాన్స్ ని అలరిస్తుంది. కాగా సుప్రీత లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేసింది. కాంట్రవర్సీ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో దిగిన ఫోటోలు సుప్రీత షేర్ చేసింది.
సుప్రీత సినిమాల్లో నటించనప్పటికీ గ్లామరస్ గర్ల్ ఇమేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ లో ఆమెకు యమా క్రేజ్ ఉంది. ఇప్పటికే పలు షాట్ ఫిలిమ్స్ లో నటించింది. యూట్యూబ్ లో కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేసింది. ఇక సుప్రీతను హీరోయిన్ గా పరిచయం చేయాలని సురేఖ వాణి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు ఇటీవల ఓ మూవీలో ఆఫర్ దక్కింది. బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అమర్ దీప్ హీరోగా నటిస్తున్న సినిమాలో సుప్రీత హీరోయిన్.
కాగా ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ క్రేజీ గర్ల్ దర్శకుడు రాంగోపాల్ వర్మ తో దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఓ పార్టీలో వీరిద్దరూ కలిశారు. సదరు సోషల్ మీడియా పోస్ట్ లో సుప్రీత… రామ్ గోపాల్ వర్మపై తనకున్న అభిమానం చాటుకుంది. పైగా ఫోటోలకు ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో మాస్టర్ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం సుప్రీత షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు దేశం మెచ్చిన చిత్రాలు తీశారు. కొన్నేళ్లుగా బూతు కంటెంట్, కాంట్రవర్సీ ఆధారంగా సినిమాలు చేస్తున్నాడు. ఇక సుప్రీత తన డెబ్యూ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. మొదటి సినిమా సక్సెస్ అయితే మంచి అవకాశాలు వస్తాయని అమ్మడు ఆశిస్తుంది. ఈ మూవీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇటీవల అమర్ దీప్ తో కలిసి దావత్ షోలో పాల్గొన్నారు.
Web Title: Supreetha shared photos with director ram gopal varma
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com