Rajamouli Mahesh Babu: తెలుగు సినిమా స్థాయిని బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి… ఆయన వేసిన బాటలోనే ప్రస్తుతం తెలుగు సినిమా దర్శకులతో పాటు సౌత్ సినిమా దర్శకులందరూ నడుస్తున్నారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబును హీరోగా పెట్టి రాజమౌళి ఒక భారీ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. పాన్ వరల్డ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇంతకుముందు హాలీవుడ్ లో వచ్చిన ‘ఇండియానా జోన్స్’ సినిమాని బేస్ చేసుకొని ఈ సినిమా ఉండబోతుందట. అయితే ఇండియానా జోన్స్ లో భారీ అడ్వెంచర్స్ ఉంటాయి. అలాగే ఈ సినిమా కోసం కూడా అడ్వెంచర్స్ తో కూడిన ఒక సూపర్ కథని రెడీ చేసుకొని తీయడానికి జక్కన్న రంగంలోకి దిగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ ను కూడా రాజమౌళి అఫిషియల్ గా అనౌన్స్ చేయడం లేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసి సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి రెడీగా ఉంచాడు. ఇక ఇప్పటికే ఆర్టిస్టులందరిని ఫైనల్ చేసిన జక్కన్న తొందర్లోనే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు. సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి? సినిమా ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించిన విషయాలను కూడా తెలియజేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఈ సినిమా మీద 18 గంటల పాటు శ్రమిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సినిమా సెట్స్ మీదికి వెళ్ళకముందే ఆయన అంతలా వర్క్ చేస్తున్నాడంటే ఒక్కసారి షూట్ కి వెళ్ళిన తర్వాత ఆయన ఎలాంటి ఎఫర్ట్ పెడతారో మనం అర్థం చేసుకోవచ్చు…
ఇక ఇదిలా ఉంటే రాజమౌళి మహేష్ బాబుతో తీస్తున్న ఈ సినిమాని తెరకెక్కించడానికి దాదాపు 8 నుంచి 10 కెమెరాలను వాడుతున్నారట. ఒకేసారి అన్ని యాంగిల్స్ లో షాట్స్ ని క్యాప్చర్ చేయడానికి ఇలాంటి ఒక డిసిజన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనివల్ల టైమ్ సేవ్ అవుతుంది. అలాగే సినిమా షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. కొన్ని షాట్స్ ను మళ్లీ మళ్లీ తీయకుండా చాలా డబ్బులు కూడా సేవ్ అవుతాయనే ఉద్దేశ్యంతోనే జక్కన్న ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల ప్రొడ్యూసర్స్ కి కూడా ఎక్కువగా నష్టమైతే రాదు. కెమెరాలకు రెంట్ కట్టడం ఒకటి మినహాయిస్తే అన్నీ కూడా దీనివల్ల ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
ఎందుకంటే వీటివల్ల ఒక్కరోజు హీరో కాల్షీట్ అనేది కలిసి వచ్చిన కూడా దానివల్ల ప్రొడ్యూసర్స్ కి చాలా వరకు బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక వాళ్లందరిని దృష్టిలో పెట్టుకుని జక్కన్న ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎంత చిన్న షాట్ అయిన కూడా నాలుగు నుంచి ఐదు కెమెరాలను వాడతారట. ఒకవేళ పెద్ద షాట్ తీయాల్సి వస్తే మాత్రం 8 నుంచి 10 కెమెరాలను వాడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే జక్కన్న లాంటి ఒక దర్శకుడు మైండ్ లో నుంచి ఒక కథ సినిమా రూపంలో వస్తుంది.
అంటే అది ఎంత గ్రాండియర్ గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు…ప్రస్తుతం రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ భారీ ఎఫర్ట్ పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమా కోసం దాదాపు 1200 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది…