Rajasaab: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కిన నాల్గవ చిత్రం ‘అఖండ 2′(Akhanda 2 Movie) వాయిదా పడడం ఇండస్ట్రీ లో కలకలం రేపింది. ఇండస్ట్రీ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ కాంబినేషన్ నుండి వస్తున్న చిత్రం, మరో గంటలో విడుదల అనగా వాయిదా పడడం అభిమానులకు జీర్ణించుకోలేని సంఘటన. థియేటర్స్ బయట హంగులు, ఆర్భాటాలు, కటౌట్స్, బ్యానర్స్ ఇలా పండగ వాతావరణం నెలకొన్న సమయం లో, ఆ చిత్ర నిర్మాతల పాత ఆర్ధిక లావాదేవీల సమస్య కారణంగా ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. ఇలాంటి సమస్యలే ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రానికి కూడా ఉందని, ఆ సినిమా కూడా చివరి నిమిషం లో ఇలా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరిగింది. IVY ఎంటర్టైన్మెంట్ సంస్థ కి ఈ చిత్ర నిర్మాతలు దాదాపుగా 260 కోట్ల రూపాయిలు చెల్లించాలి.
లేదంటే సినిమా విడుదలకు ఒప్పుకోను అంటూ ఆ సంస్థ అధినేత హై కోర్టు లో పిటీషన్ వేసాడు. దీనిపై నిర్మాత విశ్వప్రసాద్ స్పందిస్తూ ‘మా సినిమా విడుదలకు అంతరాయం కలిగించే కుట్రలు కొంతమంది చేయడం దురదృష్టకరం. ఇలాంటి చర్యలను అందరూ తీవ్రంగా ఖండించాలి. రాజా సాబ్ చిత్రం కోసం మేము సేకరించిన పెట్టబడులను మొత్తం క్లియర్ చేసాము, కేవలం వడ్డీలు మాత్రమే బ్యాలన్స్ ఉంది. అది కూడా త్వరలోనే క్లియర్ చేస్తాం. సంక్రాంతికి ఎట్టి పరిస్థితిలోను ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకొస్తాము, సంబరాలకు సిద్ధం అవ్వండి’ అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత విశ్వప్రసాద్. ఇకపోతే రీసెంట్ గానే ఈ చిత్తానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓవర్సీస్ లో మొదలు పెట్టేసారు. ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రానికి 70 వేల డాలరు 34 రోజుల ముందే రావడం గమనించాల్సిన విషయం. కచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పుతుందని అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి ట్రైలర్, టీజర్ వచ్చేసాయి. రీసెంట్ గానే ‘రెబల్ సాబ్’ పాట కూడా విడుదలైంది. ఏది కూడా వేరే లెవెల్ లో క్లిక్ అవ్వలేదు. ప్రస్తుతం రెండవ పాట కోసం ఎదురు చూస్తున్నారు, కనీసం ఈ పాటకు అయినా మంచి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.