Homeఎంటర్టైన్మెంట్Pushpa item song: ‘ఆమార్క్’ ను అందుకోలేక పోయిందా?

Pushpa item song: ‘ఆమార్క్’ ను అందుకోలేక పోయిందా?

Pushpa item song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. బన్నీ తన ఇమేజ్ కు భిన్నంగా ‘పుష్ప’లో కన్పించబోతున్నాడు. అడవి బ్యాక్ డ్రాప్.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ కొద్దిరోజులుగా సినిమా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.

Samantha
Pushpa item song In Samantha

‘పుష్ప’ నుంచి విడుదలైన టీజర్స్, టైలర్, పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. బన్నీకి జోడీగా రష్మిక మందన్న తొలిసారి నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ పై సైతం అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ‘నా సామీ’ ఓ రేంజులో అభిమానులను ఆకట్టుకుంది.

ప్రస్తుత దర్శకుల్లో ఐటమ్ సాంగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే సుకుమార్ పేరే విన్పిస్తోంది. సుకుమార్ ప్రతీ సినిమాలో ఏదో ఒకచోట ఐటమ్ సాంగ్ ఉండి తీరుతుంది. అభిమానులను సైతం సుకుమార్ నుంచి ఇలాంటివే కోరుకుంటున్నారు. ఈక్రమంలోనే ‘పుష్ప’లోనూ ఓ ప్రత్యేక గీతం రెడీ అయింది. ఈ పాట కోసం ప్రత్యేకంగా హీరోయిన్ సమంతను రప్పించారు.

పుష్పకు దేవీశ్రీ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు. సుకుమార్, దేవీశ్రీ, అల్లుఅర్జున్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ ఇప్పటివరకు బ్లాక్ బస్టర్సే. అదే కోవలో ‘పుష్ప’ మూవీ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్లో ఇప్పటిదాకా వచ్చిన ఐటమ్స్ సాంగ్స్ అన్ని కూడా ఊరమాస్ లెవల్లో ఉన్నాయి.

‘పుష్ప’లోనూ అలాంటి పాటనే అభిమానులు ఆశించారు. అయితే అందరి అంచనాలను ఈ ఐటమ్ సాంగ్ తలకిందులను చేసింది. సుకుమార్ ఎంచుకున్న పాట, చంద్రబోస్ సాహిత్యం బాగానే ఉన్నప్పటికీ దేవీశ్రీ ట్యూన్ సరిగా చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. ఊరమాస్ లెవల్లో ఉంటుందని ఆశించగా సోసోగా ఉందని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

ఈ సాంగ్ లో సమంత ప్రభు గ్లామర్ ను ఓరేంజులో చూపించింది. విడాకుల తర్వాత కెరీర్ పైనే దృష్టిసారించిన సమంత తగ్గెదేలే అన్నట్లుగా ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అంటూ లిరికల్ సాంగ్ లో రెచ్చిపోయింది. కాగా ఈ సాంగ్ ‘వీడొక్కడే’ మూవీలోని ‘హనీహనీ’ పాట తరహాలో ఉండటంతో దేవీశ్రీ ఈపాటను కాపీ కొట్టాడనే ట్రోల్స్ వస్తున్నాయి.

దేవీశ్రీ ప్రసాద్, సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో గతంలో వచ్చిన ‘అ.. అంటే అమలాపురం’.. ‘రింగరింగ’లను ‘పుష్ప’ ఐటమ్స్ సాంగ్స్ మరిపించలేక పోయిందనిపిస్తోంది. దీంతో ‘ఊ అంటావా మావ’ సాంగ్ పై మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. మొత్తానికి సమంత ఐటమ్ సాంగ్ అల్లు ఫ్యాన్స్ అందరితో ‘ఊ’ కొట్టించ లేకపోయిందనే టాక్ విన్పిస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version