Pushpa Movie: ఊ అంటారా మావా… ఊహూ అంటారా సాంగ్ కాపీ కొట్టారా…

Pushpa Movie: ఊ అంటారా మావా… ఊహూ అంటారా అంటూ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది ముద్దుగుమ్మ సమంత. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం “పుష్ప“. ఈ సినిమాలోని ఈ ఐటెమ్ సాంగ్ లో సమంత స్టెప్పులేయనుంది అని ప్రకటించినప్పటి నుంచి సాంగ్ పై అంచనాలు భారీగా పెరిగాయి. నిన్న విడుదలైన ఈ స్పెషల్ సాంగ్ యూట్యూబ్‏లో దూసుకుపోతుంది. మత్తెక్కించే వాయిస్‏ చంద్రబోస్ లిరిక్స్… దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సమంత ఊరమాస్ స్టెప్పులు ప్రేక్షకులను […]

Written By: Raghava Rao Gara, Updated On : December 11, 2021 3:42 pm
Follow us on

Pushpa Movie: ఊ అంటారా మావా… ఊహూ అంటారా అంటూ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది ముద్దుగుమ్మ సమంత. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం “పుష్ప“. ఈ సినిమాలోని ఈ ఐటెమ్ సాంగ్ లో సమంత స్టెప్పులేయనుంది అని ప్రకటించినప్పటి నుంచి సాంగ్ పై అంచనాలు భారీగా పెరిగాయి. నిన్న విడుదలైన ఈ స్పెషల్ సాంగ్ యూట్యూబ్‏లో దూసుకుపోతుంది. మత్తెక్కించే వాయిస్‏ చంద్రబోస్ లిరిక్స్… దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సమంత ఊరమాస్ స్టెప్పులు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటుంది ఈ సాంగ్. అయితే ఈ పాటను కాపీ చేశారా ? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Pushpa Movie

Also Read: ఇది పుష్ప పాట అంటూ పుకార్లు.. నిజమేనా ?

ఈ పాట ఓ వైపు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న… మరోవైపు సాంగ్ ఇంతకు ముందే ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన వీడొక్కడే సినిమాలోని హానీ హానీ పాటల ఉందని ట్రోల్ చేస్తున్నారు. ఈ రెండు సాంగ్స్ ఒకేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే పాటను పుష్ప కోసం కాపీ చేశారా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహద్ పాజిల్ విలన్ రోల్ పోషిస్తుండగా… సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసున్న మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ పేరుతో ఈనెల 17న విడుదల చేయనున్నారు.

Also Read: Pushpa Movie Runtime: బాప్ రే.. పుష్ప మూవీ అన్ని గంటలా?