Telugu Music Directors : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. ఒకప్పుడు కోటి, కీరవాణి, మణిశర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ల పాటలతో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాలకు ప్రాణం పోశారు. ఇక పాన్ ఇండియాలో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ హవా ఎక్కువగా నడుస్తోంది. ఇక ఈ క్రమంలోనే దేవి శ్రీ ప్రసాద్, తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు సైతం వాళ్ల ప్రాణం పెట్టి సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో మ్యూజిక్ డైరెక్టర్లకు ఆశించిన మేరకు గుర్తింపైతే రావడం లేదు. ఇక దేవి శ్రీ ప్రసాద్ పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో సంచలనాన్ని క్రియేట్ చేశాడు. అలాగే తమన్ సైతం రీసెంట్ గా వచ్చిన ‘ఓజీ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. అయినప్పటికి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ లతో పోలిస్తే మన వాళ్ళు చాలా వరకు వెనుక పడిపోయారనే విషయమైతే మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు వాళ్లు సాధించిన విజయాలు చాలా గొప్పగా ఎలివేట్ అవుతున్నాయి. కానీ మన వాళ్ళవి మాత్రం పెద్దగా పట్టించుకోవడంలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అనిరుధ్, సంతోష్ నారాయణన్, శ్యాం సియస్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు నుంచి వచ్చే మ్యూజిక్ గాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గాని చాలా హైలెట్ అవుతున్నాయి… ఈ లెక్కన మనవాళ్లు మ్యూజిక్ ఇచ్చుకుంటూ పోతే మాత్రం తొందర్లోనే తెలుగు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ లను పెద్దగా ఎవరు పట్టించుకునే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు అనే ధోరణిలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
నిజానికి అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే సినిమాను హిట్ చేస్తాడు అనే ఒక నమ్మకం అందరిలో కలిగింది. కాబట్టి ప్రతి ఒక్క స్టార్ డైరెక్టర్ అనే అతన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అందువల్లే తమన్ దేవి శ్రీ ప్రసాద్ లకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కరువైపోతున్నాయి. ఒకప్పుడు పెద్ద సినిమా వస్తోంది అంటే చాలు దానికి తమన్ గాని, దేవి శ్రీ ప్రసాద్ గానీ, కీరవాణి గాని మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించేవారు.
కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి వీళ్ళందరూ అవుట్ డేటెడ్ అయిపోతున్నారనే ఉద్దేశ్యంతో ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల మీదనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ బాగున్నప్పటికి అతను ట్యూన్స్ ను కాపీ చేస్తాడనే టాక్ రావడంతో ఆయన్ని కూడా పక్కన పెడుతున్నారు…